42శాతం రిజర్వేషన్లు అమలు అందరి బాధ్యత

By dhanadhannews.com

  • ఫూలే ఆశయ సాధన సమితి (పాస్) అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్

హన్మకొండ/ధనాధన్ న్యూస్: ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ ఆగదని, ఆర్డినెన్స్ తెచ్చుటకు విపక్షాలు సహకరించాలని  ఫూలే ఆశయ సాధన సమితి (పాస్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగని మల్లేశ్వర్ అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీ లోని జర్నలిజం విభాగంలో ఫూలే ఆశయ సాధన సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడూరి శాస్త్రి ఆధ్వర్యంలో  ఉమ్మడి జిల్లా సమావేశం జరిగింది. దీనికి పాస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ ముఖ్యఅతిధిగా విచ్చేసి మాట్లాడుతూ.. ఏడూ దశాబ్దాలుగా బడుగుల వెలుగులకు అడ్డంకి ఉన్న రిజర్వేషన్ల అమలు కోసం నాటి ప్రభుత్వాలు ప్రయత్నం చేయలేదన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుండి కూడా కామారెడ్డి డిక్లరేషన్ అమలుకు అనేక చర్యలు తీసుకున్నదని అందులో భాగంగా కులగణన చేసి, శాసనసభ లో తీర్మానం చేసి పంపిస్తే చట్టబద్దత చేయకుండా బీజేపీ ప్రభుత్వం నానబెట్టి కాంగ్రెస్ పై నెపం నెట్టే ప్రయత్నం చేసిందని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ మాట ఇచ్చిన ప్రకారం బీసీలకు నష్టం జరుగద్దని, మంత్రిమండలి ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తెచ్చేందుకు తీర్మానం చేయడం శుభపరిణామమని కొనియాడారు.1993లో విద్య,ఉద్యోగాలలో 69శాతం రిజర్వేషన్లు అమలు చేసినప్పుడు తమిళనాడు ప్రభుత్వం మద్దతుగా నాడు రక్షణగా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చి చట్టబద్దత కల్పించిందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తొమ్మిదవ షెడ్యూల్ ల్లో చేర్చి చట్టబద్దత కల్పించి విద్యా,ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలనీ,అప్పుడే మీ విశ్వసనీయతకు డోకా ఉండదని, ఆలా కాకుండా దొంగ దారుల్లో అడ్డంకులు సృష్టిస్తే వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.ఈ సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారికి,పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ,రాష్ట్ర బిసి సంక్షేమ మంత్రి పొన్న ప్రభాకర్ ,తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మాణం చేసింది. ఈ కార్యక్రమంలో పాస్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడూరి శాస్త్రి. పాస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చందా మల్లయ్య,ఉమ్మడి జిల్లా కార్యదర్శి డాక్టర్ నల్లాని శ్రీనివాస్, పాస్ నాయకులు శ్రీరాం వీరయ్య, డాక్టర్ వంగల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.