ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా: వొడితల ప్రణవ్

జమ్మికుంట,ఆగస్టు 5 (ధనాధన్ న్యూస్): అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.బుధవారం జమ్మికుంట పట్టణంలోని 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 14, 15, 24, 28 వార్డుల్లో నిర్వహించిన “ప్రతి గడపకు సంక్షేమం – ప్రజల వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22 […]

కరీంనగర్‌లో నూతన సిటీ బస్ సర్వీసుల ప్రారంభం

కరీంనగర్/ధనాధన్ న్యూస్: నగర ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో కరీంనగర్ నుంచి చింతకుంట, కొత్తపెళ్లి హవేలీ, వాగేశ్వరి కాలనీలకు నూతన సిటీ బస్ సర్వీసులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నగర ప్రజలకు మెరుగైన ప్రజా […]

వర్షాలకు కూలిన ఇళ్లను పరిశీలించిన దావ వసంత సురేష్

జగిత్యాల/ధనాధన్ న్యూస్ (జిల్లా ప్రతినిధి రాజా రెడ్డి): సారంగాపూర్ మండలం పెంబర్ల గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్వప్న, పరమేశ్, దుర్గేష్‌ల నివాస గృహాలు కూలిపోయాయి. ఈ ఘటనపై జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ సంఘటన స్థలాన్ని సందర్శించి కూలిన ఇళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆమె, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తక్షణమే నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని […]

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల/ధనాధన్ న్యూస్ (జిల్లా ప్రతినిధి రాజా రెడ్డి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో గురువారం జూమ్ సమావేశం నిర్వహించి వర్షాల పరిస్థితిపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని […]

సమస్యల నిలయంగా మాదారం ఆశ్రమ పాఠశాల

మహాముత్తారం, జూలై 30(ధనాధన్ న్యూస్): మండలంలోని మాదారం ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (డీటీడబ్ల్యూఓ)పై చర్యలు తీసుకోవాలని ఆర్‌వైఏ (RYA), ఏఐఎస్‌ఏ (AISA), కేవీపీఎస్ (KVPS) జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఏడాది కాలంగా మాదారం ఆశ్రమ పాఠశాల అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. విద్యార్థులకు వంటలో నాణ్యతలేని పామ్ ఆయిల్ వినియోగిస్తున్నారని, దీనివల్ల వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం […]

రాష్ట్ర,హుజూరాబాద్ ప్రజలు సుభిక్షంగా ఉండాలి: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, జూలై 29(ధనాధన్ న్యూస్): రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు ఎల్‌నినో ప్రభావంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా జీవించాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ కొండగట్టు అంజన్నను ప్రార్థించారు.బుధవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన కొండగట్టు గిరిప్రదక్షిణలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, […]

ఆషాఢ మాస వేళ గారెపల్లిలో గోరింటాకు సంబురాలు

కాటారం,జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లి గ్రామంలోని అయ్యప్ప మహిళా గ్రూపు సభ్యులు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం సామూహికంగా గోరింటాకు సంబురాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు గోరింటాకును సేకరించి ఒకరికి ఒకరు చేతులకు పెట్టుకుంటూ ఆటలు, పాటలు, నృత్యాలతో సందడి చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న మహిళలు ఆషాఢ మాస విశిష్టతను చాటుతూ ఆనందోత్సాహాలతో వేడుకను జరుపుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించడం శుభప్రదమనే […]

భారీ వర్షానికి ఇళ్లు కూలి నిరాశ్రయమైన నిరుపేద కుటుంబం

కాటారం, జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల మల్లయ్య ఇంటి గోడలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గోడలు కూలిపోవడంతో ఇంటిలో నివసించడం ప్రమాదకరంగా మారి, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఈ ఘటనపై స్పందించిన ఎర్రగుంటపల్లి గ్రామ యువత, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అత్యవసర ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని […]

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు శాస్త్రవేత్త సూచనలు

కాటారం, జూలై 27(ధనాధన్ న్యూస్): ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్ కె. మదన్ మోహన్ రెడ్డి సూచించారు.కాటారం రైతు వేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్న మూడు రోజుల […]

పోలంపల్లి గ్రామంలో ఎస్‌బీఐ సంజీవని క్లినిక్ ఆన్ వీల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం

మహముత్తారం/ధనాధన్ న్యూస్, జూలై 19: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆదివారం రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్‌బీఐ సంజీవని క్లినిక్ ఆన్ వీల్స్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో సుమారు 200 మంది గ్రామస్తులు పాల్గొని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి హిమోగ్లోబిన్ (HB), గ్రూప్ రాండమ్ బ్లడ్ షుగర్ […]