ఎన్నికల్లో గెలిపిస్తే కటింగ్-షేవింగ్ ఫ్రీ!

By dhanadhannews.com

  • సిద్దిపేట జిల్లాలో విచిత్ర హామీతో వైరల్ అవుతున్న వార్డు ఎన్నికలు!

సిద్దిపేట/ధనాధన్ న్యూస్: సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం, రఘోత్తంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు… ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్! ఏంటీ అంత స్పెషల్ అంటే… ఇక్కడ పోటీ చేస్తున్న ఒక వార్డు సభ్య అభ్యర్థి భర్త ఇచ్చిన హామీ మామూలుగా లేదు. అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ కామన్. కానీ ఈయన ఇచ్చింది మాత్రం పక్కా “మెస్మరైజింగ్ ఆఫర్”!


ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్, షేవింగ్!
రఘోత్తంపల్లిలో తన భార్య వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తుండగా, ఆమె భర్త, వృత్తిరీత్యా కటింగ్ మేస్త్రీ అయిన గిరిజన యువకుడు… ఒక సంచలన ప్రకటన చేశారు.


“నా భార్య గెలిస్తే, మా వార్డులో ఉన్న ప్రతి మగాడికి… ఐదేళ్ల పాటు కటింగ్, షేవింగ్ పూర్తిగా ఉచితం! ఇది నా గెలుపు కృతజ్ఞత!”
అంతే! ఈ హామీ గ్రామం దాటి సోషల్ మీడియాలో తుఫానులా చక్కర్లు కొడుతోంది.


యూత్‌లో చర్చ మామూలుగా లేదు!
జోక్ 1: “అరే! ఇలాంటి కటింగ్ మేస్త్రీలు మా వార్డులో ఉంటే… మా ఐదేళ్ల ఖర్చు ఆదా అయ్యేది కదా!”
జోక్ 2: “ఎలక్షన్ హామీలు అంటే కటింగ్-షేవింగ్ వరకూ వచ్చేశాయంటే… పోటీ ఎంత పెరిగిందో అర్థం చేసుకోండి!”
యూత్ కామెంట్: “మామూలుగా రోడ్లు, లైట్లు అంటారు. ఫస్ట్ టైమ్ ఇలాంటి ‘లైఫ్ స్టైల్ ఆఫర్’ విన్నాం. పక్కా సూపర్!”
12 ఏళ్లుగా చిన్న షాప్‌లో కటింగ్ షేవింగ్ చేస్తూ జీవనోపాధి పొందుతున్న ఈ మేస్త్రీ… తన వృత్తిని ప్రజలకు సేవగా మార్చి, ఓటర్లను ఆకర్షించేందుకు ఈ వినూత్న ఎత్తుగడ వేశాడు. ‘సేవతో కృతజ్ఞత’ అనే ఈ కొత్త కాన్సెప్ట్… రాజకీయాల్లో కొత్త పోకడకు దారితీస్తుందని పెద్దలు అభిప్రాయపడుతున్నారు.


ఈ ‘కటింగ్ మేస్త్రీ ఆఫర్’ రఘోత్తంపల్లి ఓటర్లను ఎంతవరకు ఆకర్షిస్తుందో చూడాలి!