హీరోయిన్‌ ఛాన్స్‌ పేరుతో రూ.60 లక్షల టోకరా

హైదరాబాద్‌/ధనాధన్ న్యూస్,మే 29: సినీ, టీవీ రంగాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్‌ మోసగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నారు. “సీరియల్‌లో హీరోయిన్‌ ఛాన్స్‌ ఇప్పిస్తా” అంటూ ఓ ప్రముఖ వైద్యుడి భార్యను నమ్మబలికిన కేటుగాడు, దాదాపు రూ.60 లక్షలు కాజేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ మోసంలో విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… బాధితురాలికి టెలివిజన్‌, వినోద … Read more

కరీంనగర్‌లో శాంతిభద్రతలపై డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో పాటు ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్ కలిసి కలసి వినతిపత్రం సమర్పించారు.ఇటీవల కరీంనగర్ నగరంలో వరుసగా జరుగుతున్న జ్యూవెలరీ షాపుల దొంగతనాలు, ప్రజలపై దాడులు, … Read more

“సామాన్యుల కాలనీల దుస్థితి: రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజల ఆవేదన”

ఒంగోలు/ధనాధన్ న్యూస్,ఏప్రిల్ 12:సామాన్య ప్రజలు నివసించే కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల కాలనీల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండగా, సాధారణ ప్రజల కాలనీల్లో మాత్రం రోడ్లు, డ్రైనేజీలు లేక దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని విమర్శిస్తున్నారు.ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని జయప్రకాష్ కాలనీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. డ్రైనేజీలు లేకపోవడం, సీసీ రోడ్లు దెబ్బతినడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు … Read more

వేసవి తీవ్రత నేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: పెరుగుతున్న వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని THR టీం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హరీష్ వర్మ అప్పని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో సాధారణ ప్రజలు, కూలీలు, రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలకు ఉపశమనం కల్పించే విధంగా పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌లు, మార్కెట్ ప్రాంతాలు, ఆసుపత్రులు వంటి జనసమ్మర్థం … Read more

ఎన్నికల్లో గెలిపిస్తే కటింగ్-షేవింగ్ ఫ్రీ!

సిద్దిపేట/ధనాధన్ న్యూస్: సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం, రఘోత్తంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు… ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్! ఏంటీ అంత స్పెషల్ అంటే… ఇక్కడ పోటీ చేస్తున్న ఒక వార్డు సభ్య అభ్యర్థి భర్త ఇచ్చిన హామీ మామూలుగా లేదు. అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ కామన్. కానీ ఈయన ఇచ్చింది మాత్రం పక్కా “మెస్మరైజింగ్ ఆఫర్”! ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్, షేవింగ్!రఘోత్తంపల్లిలో తన భార్య వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తుండగా, ఆమె భర్త, … Read more

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన రాయికల్ గ్రామ రైతులు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామానికి చెందిన రైతులు సోమవారం రోజున ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వినతి పత్రం అందజేశారు అనంతరం రైతు జేరిపోతుల రాజు మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్ట్ భూమి యొక్క నష్టపరిహారాన్ని గత నెల 7వ తారీఖు నాడు హుజరాబాద్ ఆర్డీవో సమక్షంలో మీటింగ్ ఆకునూర్ రాయికల్ రైతు సమీక్ష సమావేశం ఆర్డిఓ ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది.కరీంనగర్ జిల్లా కలెక్టర్ 12 లక్షల 20,000 ఇస్తారని హుజురాబాద్ … Read more

ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ లో  సెయింట్ జోసెఫ్ విద్యార్థినికి స్టేట్ 5వ ర్యాంక్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు  ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ వారు నిర్వహించిన వివిధ  ప్రామాణిక పరీక్షల్లో పోటీపడి జమ్మికుంట సెయింట్ జోసెఫ్ స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్థిని నిహా తన్నజ్ స్టేట్ 5వ ర్యాంక్ సాధించింది. ఇదే స్కూల్ కు చెందిన 7వ తరగతి విద్యార్థిని కే. విశ్వశ్రీ జోనల్ లెవల్ లో 9వ ర్యాంక్ సాధించింది. ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ ఫైనల్ … Read more

పట్టభద్రులకు,ప్రభుత్వానికి వారధిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందేర్ రెడ్డి భారీ మెజారిటీతో మండలికి వెళ్లడం ఖాయమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సభకు ఆయన ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తో పాటు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ పట్టభద్రులు ఓటును వృధా చేసుకోవద్దని,ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా … Read more

బీమా చట్ట సవరణ బిల్లు 2024 ను తిరస్కరించాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్:కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న 2024 బీమా చట్ట సవరణ బిల్లును ప్రతి ఒక్కరు తిరస్కరించాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) హుజురాబాద్ బ్రాంచ్ అధ్యక్షుడు బొంకూరి కుమార్ స్వామి కోరారు. బీమా చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించారు. చట్ట సవరణ బిల్లు ద్వారా వచ్చే ఇబ్బందులను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం కుమార్ స్వామి మాట్లాడుతూ… రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో … Read more

ఆటో యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట లోకల్ ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మారపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా  జక్కే  సుమన్  (సాయి), శనిగరపు దేవేందర్, సెక్రటరీగా దండ వేన మధు, జాయింట్ సెక్రటరీగా జీడి కుమార్, లను ఎన్నుకున్నట్టు జమ్మికుంట లోకల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు మారేపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.