
హైదరాబాద్/ధనా ధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు కొత్త బస్ సర్వీసులను మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రిని కోరారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని మంత్రి నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.
నియోజకవర్గంలోని బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను పరిశీలించి త్వరలోనే కొత్త సర్వీసులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే బేతిగల్–కరీంనగర్, మర్రిపల్లిగూడెం–హైదరాబాద్, జమ్మికుంట–హైదరాబాద్ మార్గాల్లో నేరుగా బస్ సర్వీసులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే మరికొన్ని ప్రాంతాలకు కూడా సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోట రాజేంద్ర ప్రసాద్, గూడూరి స్వామి రెడ్డి, నేరెళ్ళ మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.