ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా: వొడితల ప్రణవ్

జమ్మికుంట,ఆగస్టు 5 (ధనాధన్ న్యూస్): అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.బుధవారం జమ్మికుంట పట్టణంలోని 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 14, 15, 24, 28 వార్డుల్లో నిర్వహించిన “ప్రతి గడపకు సంక్షేమం – ప్రజల వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22 […]

రాష్ట్ర,హుజూరాబాద్ ప్రజలు సుభిక్షంగా ఉండాలి: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, జూలై 29(ధనాధన్ న్యూస్): రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు ఎల్‌నినో ప్రభావంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా జీవించాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ కొండగట్టు అంజన్నను ప్రార్థించారు.బుధవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన కొండగట్టు గిరిప్రదక్షిణలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, […]

వొడితల రాజేశ్వర్‌రావు సేవలు చిరస్మరణీయం: ప్రణవ్

హుజూరాబాద్, జూలై 24 (ధనాధన్ డిజిటల్ న్యూస్):మాజీ రాజ్యసభ సభ్యుడు వొడితల రాజేశ్వర్‌రావు దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిన గొప్ప నాయకుడని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం వొడితల రాజేశ్వర్‌రావు వర్ధంతి సందర్భంగా హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుడా […]

గౌన్లవానీకుంట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

జమ్మికుంట,జూలై 3(ధనాధన్ న్యూస్): జమ్మికుంట నూతన తహసీల్దార్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గడ్డం సుధాకర్‌ను 5వ వార్డు కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 5వ వార్డులోని గౌన్లవానీకుంట ఆక్రమణలకు గురవుతోందని, వెంటనే రెవెన్యూ సర్వే నిర్వహించి కుంట హద్దులు నిర్ధారించి, చుట్టూ రక్షణ గోడ (బౌండరీ) ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని వార్డు ప్రజల తరఫున తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వినతిపై స్పందించిన తహసీల్దార్ […]

ఇల్లందకుంటలో సీఎం,మంత్రులు, వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండల కేంద్రంలో నూతన తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు సత్యం, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నూతన తహశీల్దార్ కార్యాలయ […]

గ్రామ దేవతల ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఊర్లను కాపాడే అమ్మవార్లు ప్రజలకు ఇష్టమైన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం రోజున జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో గ్రామ దేవతలైన శ్రీ మహాలక్ష్మి,భూ లక్ష్మీ,నాభి శిల (బొడ్రాయి),పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం పోచమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగ్గయ్యపల్లి గ్రామంలో […]

దళితబంధు సాధన సమితి సభ్యులకు న్యాయం చేయాలి: కొలుగూరి నరేష్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జూన్ 4: దళితబంధు రెండో విడతను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మికుంట పట్టణంలో దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.అనంతరం సమితి నాయకులు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యపై వెంటనే స్పందించిన చైర్మన్, సంబంధిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ మరియు ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో ఫోన్‌లో మాట్లాడి, ఒక వారంలో సమస్య పరిష్కారానికి […]

హుజురాబాద్‌లో ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ నాయకులకు అవగాహన కార్యక్రమం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్,మే 29:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్‌ఐఆర్ (SIR) అంశంపై గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పించాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్‌ఐఆర్ సమన్వయకర్త, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమం హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో […]

డంపింగ్ యార్డు స్థల మార్పిడికి కట్టుబడి ఉన్నాం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన డంపింగ్ యార్డు స్థలాన్ని మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ, ఆయనను వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని ప్రణవ్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో రీల్స్, లైకులు పొందడానికే పరిమితమై, ప్రజా సమస్యల […]

హుజూరాబాద్‌కు మరిన్ని బస్ సర్వీసులు – మంత్రిని కలిసిన ప్రణవ్

హైదరాబాద్/ధనా ధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు కొత్త బస్ సర్వీసులను మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రిని కోరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. నియోజకవర్గంలోని బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను పరిశీలించి […]