జాతీయ రోడ్డు భద్రత మనందరి బాధ్యత: సర్పంచ్ గుర్రాల స్వతంత్ర

సైదాపూర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 13:
సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి అవసరమైన పత్రాలను ఎప్పటికప్పుడు వెంట ఉంచుకోవాలని సూచించారు.


రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని, వాహనాలు నడిపేటప్పుడు కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి జాగ్రత్తగా నడపాలని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.


ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తాటి పెళ్లి శ్రీనివాస్ రెడ్డి, హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, వార్డ్ సభ్యులు కొల్ల రాజిరెడ్డి, మామిడి సురేష్, నాగిరెడ్డి, పెద్ద సంపత్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు రమ, అల్లి, పరశురాములు, ఏఎన్ఎం రాణి, ఇందిరా, శ్యామలతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment