సిరిసేడు హైస్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు ఘన సన్మానం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు ప్రభుత్వ హైస్కూల్‌లో ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ ప్రైజ్ మనీ అందజేశారు.


ఈ సందర్భంగా స్కూల్ ఫస్ట్ సాధించిన విద్యార్థికి రూ.5,000, స్కూల్ సెకండ్ వచ్చిన విద్యార్థికి రూ.3,000, స్కూల్ థర్డ్ స్థానం పొందిన విద్యార్థికి రూ.2,000 నగదు బహుమతులను అందించారు. విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.


ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్సై క్రాంతి కుమార్, ఎంఈఓ రాములు, ఉప సర్పంచ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల విజయాలు గ్రామానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.

Leave a comment