ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

  • పలు గ్రామాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ

సైదాపూర్/ధనాధన్ న్యూస్:
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైదాపూర్ మండలంలోని గ్రామాల్లో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడుతూ..దశాబ్దాల కల నెరవేరిన రోజు తెలంగాణ ఆవిర్భావ దినమని పేర్కొన్నారు. ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. “మన రాష్ట్రం – మన పాలన” అనే లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.

తెలంగాణ సాధన కోసం ఎంతో మంది ఉద్యమకారులు ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, ఎంఈఓ రవీంద్రచారి, ఏపీఓ రాణి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు

Leave a comment