మత సామరస్యానికి ప్రతీకగా మొహరం ఉత్సవాలు

నంగునూరు/ధనాధన్ న్యూస్,జూన్ 20:
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామంలో మొహరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మతాలకు అతీతంగా, చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, గట్ల మల్యాల గ్రామంలో ప్రతి సంవత్సరం మొహరం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. హిందూ, ముస్లిం సోదరులు కలిసి సామరస్య వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవడం గ్రామ ప్రత్యేకత అని తెలిపారు.
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ మొహరం వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, వేడుకలు మరికొన్ని రోజులు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a comment