మాతృత్వానికి మానవత్వం జోడించిన ఓం శ్రీ సాయి హాస్పిటల్

జగిత్యాల, ఆగస్టు 3 (ధనాధన్ న్యూస్): వైద్యం అంటే కేవలం చికిత్స మాత్రమే కాదు.. సేవ, మానవత్వం, ఆప్యాయత కూడా కలిసినప్పుడే అది సంపూర్ణమవుతుంది. ఈ మాటలను నిజం చేస్తూ జగిత్యాల పట్టణంలోని ఓం శ్రీ సాయి హాస్పిటల్ ప్రసూతి సేవల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చే ప్రతి తల్లికి, నవజాత శిశువుకు అవసరమైన వస్తువులతో కూడిన ఉచిత బేబీ కిట్‌ను అందజేస్తూ మాతృత్వానికి మధుర జ్ఞాపకాన్ని అందిస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన కేసీఆర్ […]

వర్షాలకు కూలిన ఇంటిని పరిశీలించిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

జగిత్యాల/ధనాధన్ న్యూస్: సారంగపూర్ మండలంలోని పెంబట్ల, కోనపూర్ గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే సమయంలో పెంబట్ల గ్రామానికి చెందిన పాస్తం స్వప్న, ఆమె సోదరులు పరమేష్, దుర్గేష్ నివాస గృహం భారీ వర్షాల కారణంగా పూర్తిగా కూలిపోయింది.ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కూలిన ఇంటిని పరిశీలించిన అనంతరం మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ), […]

పీఏసీఎస్‌లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

జయశంకర్ భూపాలపల్లి,జులై 2 (ధనాధన్ న్యూస్): కాటారం మండలంలోని గారేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)ను జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందేలా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా జరుగుతున్న యూరియా విక్రయాల ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఈ-పోస్ యంత్రాల ద్వారా జారీ చేస్తున్న బిల్లులు, రైతుల బుకింగ్ వివరాలు, స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల నిల్వల […]

తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్, జులై 2 (ధనాధన్ న్యూస్): రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వాగ్వాదం బుధవారం ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఇరు పార్టీల నేతలు పరస్పరం సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో గన్‌పార్క్ కేంద్రంగా రాజకీయ వేడి నెలకొంది.కాంగ్రెస్ తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ గన్‌పార్క్‌కు చేరుకుని చర్చకు సిద్ధమయ్యారు. […]

ఎస్ఐఆర్‌పై ప్రజలకు అవగాహన అవసరం

కాటారం,జులై 2 (ధనాధన్ న్యూస్): భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన అవసరమని బీఆర్ఎస్ మండల నాయకుడు, ఇబ్రహీంపల్లి మొదటి వార్డు సభ్యుడు మంతెన చిరంజీవి అన్నారు.కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ఇంటింటి అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ పేర్లు, వ్యక్తిగత వివరాలను ఓటరు జాబితాలో […]

కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఎక్కడ?

కమలాపూర్,జూన్ 30(ధనాధన్ న్యూస్): హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించిన కల్యాణలక్ష్మి, గర్భిణీల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రైతులకు రైతుబంధు వంటి పథకాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం […]

మత సామరస్యానికి ప్రతీకగా మొహరం ఉత్సవాలు

నంగునూరు/ధనాధన్ న్యూస్,జూన్ 20:సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామంలో మొహరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మతాలకు అతీతంగా, చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, గట్ల మల్యాల గ్రామంలో ప్రతి సంవత్సరం మొహరం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. హిందూ, ముస్లిం సోదరులు కలిసి సామరస్య వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవడం గ్రామ ప్రత్యేకత అని తెలిపారు.మత సామరస్యానికి ప్రతీకగా […]

పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 20: సారంగాపూర్ మండలం పోతారం గ్రామంలో శుక్రవారం రాత్రి పిచ్చికుక్క దాడిలో గాయపడిన బాధితులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. పిచ్చికుక్క దాడిలో మహిళలు సహా 11 మందికి పైగా గాయపడగా, వారు జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆస్పత్రికి వెళ్లిన ఎమ్మెల్యే బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయపడిన […]

నాడు కరీంనగర్ లో..నేడు ధర్మపురిలో

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 17:(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ – జగిత్యాల): గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కల్యాణ లక్ష్మి చెక్కులు, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల కొరకు లబిద్దారులు కరీంనగర్ వెళ్లే పరిస్థితి ఉండేదని నేడు ప్రజా ప్రభుత్వంలో ధర్మపురి నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లోనే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో నలుగురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి […]

జగిత్యాల బాలిక శ్వేష్ట రెడ్డి అరుదైన ఘనత

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 17:జగిత్యాల పట్టణానికి చెందిన లంకన్నగారి శ్వేష్ట రెడ్డి అనే రెండేళ్ల 11 నెలల 22 రోజుల చిన్నారి అరుదైన ఘనత సాధించింది. అసాధారణ జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానులను కేవలం ఒక నిమిషంలో గుర్తించి అత్యంత వేగంగా చెప్పిన టాడ్లర్‌గా శ్వేష్ట రెడ్డి రికార్డు నెలకొల్పింది. ఈ ఘనతను ఆమె 2026 జూన్ 8న సాధించగా, ఇండియా బుక్ […]