జగిత్యాల, ధనాధన్ న్యూస్: జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

అనంతరం గ్రామానికి చెందిన నాయకులు గుంటి చిన్నన్న మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బాలపల్లి గ్రామంలోని శ్మశానవాటిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని, అర్హులైన లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు చేసే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సర్పంచ్ రెడ్డి రత్న, ఉపసర్పంచ్ గుంటి రవి, ఎంపీఓ రవి బాబు, ఏఈ విజయ్, డీటీ భూమయ్య, మాజీ ఉపసర్పంచ్ గంగారెడ్డి, కడ మహేష్, మల్లేష్, భూమారెడ్డి, గంగారెడ్డి, గంగరాజం, శశికుమార్, సతీష్‌తో పాటు వార్డు సభ్యులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply