ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలిసిన నారపాక అశోక్

జగిత్యాల, ధనాధన్ న్యూస్ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలో బీజేపీ ఎస్సీ మోర్చాను మరింత బలోపేతం చేయడంతో పాటు, దళిత వర్గాలను పార్టీకి మరింత చేరువ చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.ప్రత్యేకంగా బీర్పూర్ మండలంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి […]
జగిత్యాల అర్బన్ బీజేపీ ఓబీసీ మోర్చా జనరల్ సెక్రెటరీగా సల్ల రమేష్

జగిత్యాల, ధనాధన్ న్యూస్ : జగిత్యాల అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జనరల్ సెక్రెటరీగా సల్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు అర్బన్ మండల బీజేపీ అధ్యక్షుడు దణ్ణపునేని నరేష్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, దీర్ఘకాలంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ, బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సల్ల రమేష్ సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు […]
మహిళలకు ఉపాధి కల్పిస్తున్న సౌమ్యను అభినందించిన ఆడువాల జ్యోతి లక్ష్మణ్

జగిత్యాల, ధనాధన్ న్యూస్: మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించడంతో పాటు, ఇతర మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.జగిత్యాల పట్టణంలో ఏవీకే మెహందీ ఆర్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెహందీ ఆర్ట్ కేంద్రాన్ని ఆడువాల జ్యోతి లక్ష్మణ్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు సౌమ్యను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.హైదరాబాద్ నగరంలో లభించే మెహందీ ఆర్ట్ సేవలను జగిత్యాలలోనే అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని అన్నారు. మహిళల […]
కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి

జగిత్యాల, ధనాధన్ న్యూస్: తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్లో ఉన్న ఆయన విగ్రహానికి బీసీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర […]
పోచమ్మ తల్లి దేవాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ దంపతుల ప్రత్యేక పూజలు

జగిత్యాల, ధనాధన్ న్యూస్: పట్టణంలోని పురాణిపేట శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం 64వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఆశీస్సులతో జగిత్యాల పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సమిండ్ల వాణి శ్రీనివాస్ […]
ఆర్టీఐ దరఖాస్తుల వల్లే ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఆగిపోయాయా?

బుగ్గారం/ధనాధన్ న్యూస్: బుగ్గారం మండలంలో ఆర్టీఐ దరఖాస్తుల కారణంగానే 40 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రావాల్సిన బిల్లులు నిలిచిపోయాయంటూ కొన్ని దినపత్రికల్లో వచ్చిన వార్తలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని సీనియర్ ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం బుగ్గారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కు వినతిపత్రం సమర్పించారు. ఎంపీడీవో తరఫున ఎంపీవో బింగి సురేష్ వినతిపత్రాన్ని స్వీకరించారు. ఆర్టీఐ దరఖాస్తుల వల్లే ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు […]
నూర్‌బాషా,దూదేకుల ముస్లిం సమాజానికి 2010 జీవో అమలు చేయాలి

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: నూర్‌బాషా, దూదేకుల ముస్లిం సమాజ సంక్షేమం కోసం 2010లో జారీ చేసిన జీవోను వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముస్లిం నూర్‌బాషా దూదేకుల బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ జేఏసీ ప్రతినిధులు సీఎం ప్రజావాణికి వినతిపత్రం సమర్పించారు. 2010 మే 3న మైనారిటీ వెల్ఫేర్ శాఖ జారీ చేసిన జీవో ఎంఎస్ నం.125 ప్రకారం నూర్‌బాషా, దూదేకుల ముస్లింల సహకార సంఘాలు, ఫైనాన్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి అమలు చేయాలని జేఏసీ ప్రతినిధులు […]
లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన బీర్పూర్ ఆర్ఐ

జగిత్యాల,ధనాధన్ న్యూస్: జగిత్యాల జిల్లా బీర్పూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) రాహుల్ ఏసీబీ అధికారుల వలలో చిక్కినట్లు సమాచారం. ఓ పని నిమిత్తం లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా దాడి నిర్వహించి ఆర్ఐ రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన వద్ద నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం బీర్పూర్ రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే […]
బాలపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

జగిత్యాల, ధనాధన్ న్యూస్: జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గ్రామానికి చెందిన నాయకులు గుంటి చిన్నన్న మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

జగిత్యాల, ధనాధన్ న్యూస్: జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం జగిత్యాల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వేదిక నిర్మాణం, పతాకావిష్కరణ స్థలం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రాంగణం, స్టాళ్ల ఏర్పాటు, పార్కింగ్, భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు […]
