
ఎల్కతుర్తి, సెప్టెంబర్ 27, ధనాధన్ న్యూస్: వ్యవసాయ రంగంలో రైతులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా స్వర్ణ నంది పురస్కారం అందుకున్న రైతు నాయకుడు హింగే భాస్కర్‌ను తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు, రైతులు ఘనంగా సన్మానించారు.
ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు, సమితి సలహాదారు సకినే సుధాకర్‌తో పాటు పలువురు రైతులు హింగే భాస్కర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వరికెల కిషన్ రావు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న హింగే భాస్కర్‌కు స్వర్ణ నంది పురస్కారం లభించడం రైతు సమాజానికి గర్వకారణమన్నారు. వ్యవసాయ రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు ఈ పురస్కారం గుర్తింపుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమం కోసం హింగే భాస్కర్ భవిష్యత్తులోనూ మరింతగా పనిచేస్తూ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రైతులు ఎర్రబెల్లి రవీందర్, భాషబోయిన కుమారస్వామి యాదవ్, వీరస్వామి, గూడెల్లి రాములు తదితరులు పాల్గొని హింగే భాస్కర్‌ను అభినందించారు.
