విలేకరిని బెదిరించిన వారిపై కేసు నమోదు

భూపాలపల్లి,జూన్ 7 (ధనాధన్ న్యూస్):జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన జర్నలిస్టు ఇప్పకాయల సాగర్‌ను దూషించి, ప్రాణహాని కలిగిస్తామని బెదిరించిన ఘటనలో రాయపల్లి గ్రామ సర్పంచ్ తాడం తిరుపతి, అంకం రాజేందర్‌లపై రేగొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.వివరాల్లోకి వెళ్తే, రాయపల్లి గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలింపుపై జర్నలిస్టు ఇప్పకాయల సాగర్ వార్త ప్రచురించారు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తులు ఫోన్ ద్వారా దూషిస్తూ, చంపుతామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. … Read more