- రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది
- సైదాపూర్ మండలంపై వివక్ష ఎందుకు? రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా?

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి, కరువు పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకోవాలని మండలాన్ని కరువు మండలంగా తక్షణమే ప్రకటించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి మండల శాఖ ఆధ్వర్యంలో సైదాపూర్ పాతబస్తాండ్ నుండి భారీగా ర్యాలీ గా బయలుదేరి మండల తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ ఎంపిడిఓ కార్యాలయం లో ఎంపిడిఓ యాదగిరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో వైదేహి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ
ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి, వారికి తక్షణమే ప్రభుత్వ సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని. కరువు పరిస్థితులతో నష్టపోతున్న రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంలో ఎందుకు జాప్యం చేస్తోందని . రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కరువు మండలంగా ప్రకటించి, అర్హులైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.వే సైదా పూర్ మండలంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారా? లేక సవతి తల్లి ప్రేమ చూపుతున్నారా? అని ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సైదాపురు మండల రైతాంగానికి న్యాయం జరిగే వరకు భారత రాష్ట్ర సమితి ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వే సై దా పూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంతో పాటు, రైతులకు అందాల్సిన సహాయ చర్యలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు కరువు పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవాలి అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం, సహాయక చర్యలు అందించాల రైతాంగ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చెల్మల్ల రాజేశ్వర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి పైడిపల్లి రవీందర్ గౌడ్ మాజీవైస్ ఎంపీ పి రావుల శ్రీధర్ రెడ్డి మండల బారస మాజీ అధ్యక్షుడు సొమరపు రాజయ్య సర్పంచులు చాడ అఖిల ప్రకాశ్ రెడ్డి . మేడవేని గోపాల్. మచమల్ల శ్రీకాంత్ ఉప సర్పంచ్ లు కె విరస్వామి . కే.వినయ్ టి శ్రీనివాస్ బా రస మండల నాయకులు పి తిరుపతి గౌడ్ మట్టెల రవీందర్ . బి రమేష్ నాయక్ వి రమేష్ కొత్త మధుసూదన్ రెడ్డి మునిపల శ్రీనివాస్ ఆర్ తిరుపతి. జి శ్రీనివాస్ ఆ సరి స్వామి ఏం సుధాకర్ బి పరశురాములు గుళ్ళ అశోక్. రా మ్మన్న .రవీందర్ మహిపాల్ సింగ్ దూల సురేష్ బత్తుల మోహన్ తొడేటి అశోక్ .జీవన్ రెడ్డి .తిరుపతి. టీ వేణుగోపలు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
