సకాలంలో వర్షాలు కురవాలని గ్రామదేవతలకు జలాభిషేకం

సైదాపూర్,జూలై 17 (ధనాధన్ డిజిటల్ న్యూస్): సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో శుక్రవారం సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఊరేగింపు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సంప్రదాయం ప్రకారం రోకలి బండకు కప్పను వస్త్రంతో కట్టి గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి గడపకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. “కప్పతల్లి… కప్పతల్లి… కడవడే నీళ్లు” […]
