నంగునూరు (ధనాధన్ న్యూస్): నంగునూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 8 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటిలో పంచాయతీ శాఖకు ఒకటి, రెవెన్యూ శాఖకు ఒకటి, మార్కెటింగ్ శాఖకు ఒకటి, హౌసింగ్ శాఖకు రెండు, విద్యుత్ శాఖకు ఒకటి, ఐసీడీఎస్ శాఖకు రెండు దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై విచారణ జరిపి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. మండల ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply