
నంగునూరు (ధనాధన్ న్యూస్): వాతావరణ మార్పుల నేపథ్యంలో గొర్రెలు, మేకలను వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంచేందుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గట్ల మల్యాల గ్రామంలో పీపీఆర్ టీకాలు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తిప్పని శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ గాండ్ల రమేష్, వెటర్నరీ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ స్వామి, ఓఎస్ బుద్ధి యాదగిరి, నరేష్, గోపాలమిత్ర పిల్లి నరసింహులు, మాటూరి మల్లేశం, మంగళారపు వెంకటేష్‌తో పాటు గొల్ల, కురుమ, యాదవ సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
