తెలంగాణ ఉద్యమకారుడు పులిగారి చంద్రశేఖర్ రెడ్డికి ఘన నివాళి

వికారాబాద్/ధనాధన్ న్యూస్ జూన్ 8: తెలంగాణ ఉద్యమకారుడు, వికాస్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ దివంగత పులిగారి చంద్రశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా సోమవారం వికాస్ జూనియర్ కళాశాల ఆవరణలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి తెలంగాణ ఉద్యమకారులు, కళాశాల సిబ్బంది, మున్నూరు సోమారం గ్రామ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పులిగారి చంద్రశేఖర్ రెడ్డి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజ సేవతో పాటు విద్యా రంగ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.


ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, డైరెక్టర్ రాంరెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, ధారూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు కౌశిక్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు దేవదాస్, మున్నూరు సోమారం గ్రామ సర్పంచ్ రాజు, ధారూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాములు, నాయకులు దివాకర్ రెడ్డి, గోవర్ధన్, కుమార్, కృష్ణంరాజు, అధ్యాపకులు ప్రభాకర్ రెడ్డి, రామచందర్, నర్సింహులు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి మానవతా సేవను చాటుకున్నారు.

Leave a comment