ధనా ధన్ న్యూస్ పోర్టల్ ని లాంచ్ చేసిన ప్రొఫెసర్ కోదండరాం.

By dhanadhannews.com

-ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ మీడియా పాత్ర కీలకం.

-వార్తకోసం వెయిట్ చేయవలసిన అవసరం లేదు.

-ఎప్పటి వార్తలు అప్పుడే చూసుకోవచ్చు.

-ప్రజా సమస్యలపై ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజలకు వారధి ఉండాలే.

హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ లో జరిగిన పీవి హుజురాబాద్ జిల్లా సాధన సదస్సు కార్యక్రమానికి తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరైయ్యారు.

ఈ కార్యక్రమంలో ధనా ధన్ న్యూస్ పోర్టల్ ని ఆయన లాంచ్ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మీడియా రంగం లో డిజిటల్ మీడియా యుగం నడుస్తుందని,డిజిటల్ మీడియా వచ్చిన దగ్గరి నుండి,రేపు వార్త వచ్చే వరకు వెయిట్ చేసే పని లేకుండా ఎప్పటి వార్తలు అప్పుడు తెలుసుకునే అవకాశం దొరుకుతుందని తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న సమాజానికి అనుగుణంగా ఎప్పటి వార్తలు అప్పుడు అందించేందుకు ఏర్పాటైన ధనా ధన్ న్యూస్ పోర్టల్ యాజమాన్యాన్ని అభినందించారు.ప్రభుత్వానికి ప్రజలకు వారధి గా పనిచేస్తూ ప్రజా సమస్యలు వెలికి తీసి,సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు,అంబటి శ్రీనివాస్,మహిళా జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి,భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కిరణ్,యువజన సమితి నాయకులు మోరే గణేష్, కర్రే సతీష్ యాదవ్, పల్లెర్ల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.