మాల సంక్షేమ సంఘం సర్వాయిపేట గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా దొంత హరీష్ ఏకగ్రీవ ఎన్నిక

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 14: సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వాయిపేట, శివరాంపల్లి జంట గ్రామాల మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా దొంత హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.సంఘ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, మాల సంఘం సంక్షేమం, ఐక్యత, పురోగతి కోసం నిరంతరం పనిచేస్తానని హరీష్ పేర్కొన్నారు. సంఘ సభ్యులందరి సహకారంతో గ్రామాల్లో సామాజిక, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు.


ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు వేముల మహేశ్వర్, ఉపాధ్యక్షుడు బొల్లుమల్ల శ్రీనివాస్, కార్యదర్శి బోగం రాకేష్, కార్యవర్గ సభ్యులు జెల్ల మొగిలి, నీలం యాకయ్య, గొల్లపల్లి సంతోష్, జెల్ల అన్వేష్ తదితర సంఘ నాయకులు, కుల బాంధవులు పాల్గొన్నారు.

Leave a comment