అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:అటవీశాఖ అధికారులు

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 18 (ప్రతినిధి):
వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలోని అటవీ భూమిలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ ఉన్నతాధికారులు అడవుల ఆవశ్యకత, మొక్కల పెంపకం ప్రాధాన్యత, వాటి సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు, సలహాలు అందించారు.


అలాగే రాయికల్ అటవీ ప్రాంతంలో ఉన్న రాయికల్ జలపాతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయికల్ గ్రామ సర్పంచ్ చాడ అఖిలా ప్రకాశ్ రెడ్డి, అటవీశాఖ ఉన్నతాధికారి శ్రీమతి లత, ఎఫ్‌ఆర్‌ఓ, అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్ నగేష్, రాయికల్ మాజీ ఉపసర్పంచ్ వేమునూరు రమేష్, యాదవ సంఘం అధ్యక్షుడు అప్పని అశోక్, రాముడి రణధీర్ రెడ్డి, గూడ రాజిరెడ్డి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.

Leave a comment