జమ్మికుంట పట్టణ కేంద్రంలోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యాలయంలో హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు సౌడమల్ల యోహన్, అయిత రాధాకృష్ణ ఆధ్వర్యంలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు… ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి, యూనియన్ సభ్యులకు,నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులకు ,ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు విద్యార్థులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు సౌడమల్ల యోహన్, అయిత రాధాకృష్ణ మాట్లాడుతూ దేశ సేవకు ప్రజలంతా పునరాంకితం కావాలని, రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకొని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని, సమ సమాజ స్థాపనకు ముందుకు రావాలని తెలిపారు.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టు సోదరులు ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు చేరవేయాలని నిష్పక్షపాతంగా వార్తలను ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ ప్రజాసేవలో ముందుండాలని యూనియన్ సభ్యులకు సూచించారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూపతి సంతోష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరికిల్ల భానుచందర్,కోశాధికారి దయ్యాల సుధాకర్, ఉపాధ్యక్షులు యెబూసి సంపత్,సహాయ కార్యదర్శి ఖాజా ఖాన్, కార్యవర్గ సభ్యులు దొడ్డే రాజేంద్ర ప్రసాద్, కొండా విజయ్, రచ్చ రవి కృష్ణ,అంబాల శ్రీరామ్, కొక్కుల శ్రీరాములు, కందుకూరు రాజు, రామంచ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
