చెన్నూర్ ఎస్బీఐలో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం – 44 మంది అరెస్టు

By dhanadhannews.com

  • ప్రధాన నిందితుడు ఎస్బీఐ చెన్నూర్ బ్రాంచ్ క్యాషియర్
  • 402 గోల్డ్ లోన్ ఖాతాల్లో మోసం – రూ.12.61 కోట్ల నష్టం
  • 10 ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలలో 142 నకిలీ గోల్డ్ లోన్లు
  • ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం ఉద్యోగులు – ఫైనాన్స్ కంపెనీలతో కలిసి కుచ్చుటోపీ

చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో భారీ గోల్డ్ లోన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 23న ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఫిర్యాదు మేరకు పోలీస్‌లు దర్యాప్తు చేసి, ఇప్పటివరకు 44 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నారు.

ప్రధాన నిందితుడు నరిగె రవీందర్ (క్యాషియర్) ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోగొట్టి, నష్టాన్ని పూడ్చుకునేందుకు బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్ తో కుమ్మక్కై 25.17 కిలోల బంగారం, రూ.1.10 కోట్లు దుర్వినియోగం చేశాడు.

ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలలో SBFC, Indel Money, Muthoot Finance, Godavari Urban, Manappuram, Muthoot Mini పేర్లతో 44 మంది మీద 142 గోల్డ్ లోన్లు తీసుకున్నారు. అంతేకాదు, తప్పుడు గోల్డ్ లోన్ల ద్వారా రూ.1.58 కోట్లు విత్‌డ్రా చేసి, ఏటీఎంలలో నగదు రీఫిల్ సమయంలో కూడా డబ్బు అపహరించారు.

దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 15.23 కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.61 లక్షల నగదు రికవరీ అయ్యాయి. మిగిలిన ఆభరణాల వేట కొనసాగుతోంది.

ప్రధాన నిందితులు:

1. నరిగె రవీందర్ – క్యాషియర్, SBI చెన్నూర్ బ్రాంచ్

2. వెన్నపురెడ్డి మనోహర్ – బ్రాంచ్ మేనేజర్, SBI చెన్నూర్

3. లక్కాకుల సందీప్ – అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి, SBI చెన్నూర్


మరియు వారితో కుమ్మక్కై మోసానికి పాల్పడిన ఇతరులు:

కొంగొండి బీరేష్ (సేల్స్ మేనేజర్, SBFC మంచిర్యాల్)

కోదాటి రాజశేఖర్ (కస్టమర్ రిలేషన్ మేనేజర్, SBFC)

బొల్లి కిషన్ కుమార్ (సేల్స్ ఆఫీసర్, SBFC)

ఉమ్మాల సురేష్ (ఫోటోగ్రాఫర్)

నడిగొట్టు సాగర్ (ప్లంబర్)

రాంశెట్టి చంద్రబాబు (ప్రైవేట్ ఉద్యోగి)

భరతపు రాకేష్ (ఫైనాన్స్ ఏజెంట్)

దిగుట్ల సునీల్ (సెంటరింగ్ వర్క్)

… (మొత్తం 44 మంది – పూర్తి జాబితా పోలీసులు విడుదల చేశారు).

పోలీసుల కృషి

ఈ కేసును తక్కువ కాలంలో ఛేదించినందుకు రామగుండం కమిషనర్ ఏ. భాస్కర్, ఐపీఎస్ ప్రత్యేక బృందాలకు అభినందనలు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.