బాల్యంలోనే చట్టాలపై అవగాహన అవసరం

By dhanadhannews.com

  • సురక్షిత బాల్యం పై అవగాహన కార్యక్రమం

సైదాపూర్,ధనాధన్ న్యూస్:

బాల్యంలోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వెన్కేపల్లి ఎంపిటిసి సభ్యులు, న్యాయవాది జంపాల సంతోష్ తెలిపారు.సురక్షిత బాల్యంపై అవగాహన కల్పించడంలో భాగంగా స్నేహిత కార్యక్రమం మండల కేంద్రంలోని వెన్కేపల్లి ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది.ఈ కార్యక్రమంలో బాలికా,మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు.లింగ సమానత్వం, బాలికా శిశు రక్షణ,పిల్లల విద్య, రక్షణ చర్యలపై హింస ప్రభావం,పిల్లలలో డ్రగ్ దుర్వినియోగం నివారణ,సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం,పిల్లల లైంగిక వేధింపుల నివారణ,పోక్సో చట్టం,జీవణా నైపుణ్యాలు,ఆత్మగౌరవం,రక్షణ,శరీర మూల్యాంకనం, ప్రవర్తనా మార్పులు,శరీర సానుకూలత,చైల్డ్ ట్రాఫికింగ్,దోపిడీ,బాల కార్మిక వ్యవస్థ-నివారణ చర్యలు,చైల్డ్ సైకాలజీ, పాజిటివ్ పేరెంటింగ్.గుడ్ టచ్,బ్యాడ్ టచ్ అనే అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెరుగు దేవేందర్ రెడ్డి,గ్రామ కార్యదర్శి జక్కి తిరుమల,ఐసిడిఎస్ సూపర్ వైజర్ స్వరూప,మహిళా సమాఖ్య నాయకురాలు రేణుశ్రీ పాఠశాల మహిళా ఉపాధ్యాయులు పద్మ,సరిత తదితరులు పాల్గొన్నారు.