హుజురాబాద్,ధనాధన్ న్యూస్:
తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జిల్లా మరియు మండల కమిటీల
నిర్మాణం లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి యువజన నాయకుడు
మరియు రిపోర్టర్ కుడికాల సాయిని
హుజూరాబాద్ నియోజకవర్గ తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్బంగా కుడికాల సాయి మాట్లాడుతూ నియోజకవర్గం లోని పద్మశాలి జాతి శ్రేయస్సు కోసం చేనేత కార్మికుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని,అదే విధంగా నియోజక వర్గ వ్యాప్తంగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక కమిటీలు ప్రచార కార్యదర్శి జడల చిరంజీవి సహకారంతో నిర్మాణం చేస్తామని సాయి తెలిపారు.
