మండల బాలల పరిరక్షణ కమిటీ శిక్షణ కార్యక్రమం.

By dhanadhannews.com

జమ్మికుంట,ధనా ధన్ న్యూస్.

కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సమగ్ర బాలల అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో హుజురాబాద్ సిడిపిఓ భాగ్యలక్ష్మి అధ్యక్షతన జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయం నందు మండల బాలల పరిరక్షణ కమిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మార్వో రజని మాట్లాడుతూ బాలల పరిరక్షణ కమిటీల ఏర్పాటు విధి విధానాలు బాలల హక్కుల పరిరక్షణ మరియు బాలల చట్టాల గురించి బాల కార్మిక,బాల్యవివాహాల నిర్మూలన,లైంగిక వేధింపులు,బ్రూణ హత్యలు నిర్మూలన మరియు విద్యాహక్కు చట్టం వివిధ చట్టాల పైన ముఖ్యంగా గ్రామ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్త ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వివిధ గ్రామస్థాయి అధికారులు అవగాహనా కలిగి ఉండాలన్నారు.బాలల హక్కుల పరిరక్షణ కోసం అందరు సహకరించాలని,18 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి ఏదైనా సమస్య దృష్టికి వస్తే కమిటీ దృష్టికి గాని పోలీసువారి 100 కానీ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఉచిత నెంబర్ కు సమాచార ఇవ్వగలరని అన్నారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఎంపీడీవో కల్పన,సిడిపిఓ భాగ్యలక్ష్మి, ఎస్సై రాజేష్, ఎం ఈ ఓ శ్రీనివాస్,బాలల పరిరక్షణ అధికారి రమేష్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సూపర్వైజర్ దూడం కుమారస్వామి, ఐసిడిఎస్ సూపర్వైజర్ శిరీష, పద్మ, ఏ పిఎం శ్రీనివాస్,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ క్యూసియా,చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కేస్ వర్కర్ సాయి కిరణ్,పూజారులు,పాస్టర్లు,అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు.