మానవత్వం చాటుకున్న రాయికల్ 2004-05 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ మిత్రులు

  • అనారోగ్యంతో ఉన్న మిత్రుడికి అండగా నిలిచిన ఎస్‌ఎస్‌సీ బ్యాచ్

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 21: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన 2004-05 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ విద్యార్థులు తమ సహాధ్యాయి మాచర్ల నాగరాజుకు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.రాయికల్ గ్రామానికి చెందిన మాచర్ల నాగరాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో ఆయన తండ్రి మాచర్ల కొమురయ్య గత 20 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.


ఈ విషయం తెలుసుకున్న 2004-05 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ మిత్రులు నాగరాజు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.30 వేల నగదు ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా సుమారు రెండు నెలలకు సరిపడా కిరాణా సామగ్రిని కూడా అందించారు.
ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ నాగరాజు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. ఆయనకు మనోధైర్యం కల్పిస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.

Leave a comment