బిర్యానీ వండిన స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో అజిత్ కు మార్ అవకాశం దొరికిందంటే చాలు బైక్పై దేశాన్నే చుట్టేస్తుంటారు. ఆయన ఇండియాతోపాటు ఇతర దేశాలకు సైతం బైక్పై వెళ్తూ నేచర్ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తాజాగా తన రైడర్స్ గ్రూప్లో ట్రిప్లో ఉన్న అజిత్.. బిర్యానీ వండుతున్న వీడియో వైరలవుతోంది. స్నేహితుల కోసం అజిత్ ఎంతో ఓపికగా ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఇటీవలే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే

ఆసుపత్రిలో చేరిన తమిళ్ హీరో అజిత్ కుమార్

ప్రముఖ సినీనటుడు అజిత్ కుమార్ ఈరోజు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.సినిమా షూటింగ్ సమయంలో బాడీ సహకరించ కపోవడంతో సాధారణ శారీరక పరీక్షల నిమిత్తం అజిత్‌ ను ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం.ప్రస్తుతం ఆయన మగిజ్ తిరుమేని దర్శకత్వంలో‘విడముయార్చి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా గత కొన్ని రోజులుగా షూటింగ్ ఆగిపోయింది.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు