బత్తుల లక్ష్మీనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ పక్షవాతం బారిన పడిన విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పందించారు. ప్రస్తుతం హనుమకొండలోని అజరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణను ఆయన సందర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడిన సతీష్ కుమార్, ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకుంటారని నమ్మకం వ్యక్తం చేస్తూ, ఎలాంటి ఆందోళన […]
పాడి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని మాదిగ హక్కుల దండోరా డిమాండ్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న తాజా పరిణామాలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రసంగిస్తున్న సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేయాలని మాదిగ హక్కుల దండోరా(ఎమ్ హెచ్ డి ) డిమాండ్ చేస్తోంది.నిండు సభలో ఒక దళిత ఎమ్మెల్యేతో బి ఆర్ […]
వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించగా, గ్రామం మొత్తం శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. భక్తాంజనేయ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలు సమర్పించి వేదమంత్రాల నడుమ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, రామాయణంలో వశిష్ట మహర్షి శ్రీరాముడికి నామకరణం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. […]
ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి

జమ్మికుంట/ధనధన్ న్యూస్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అక్రమ అరెస్టులకు పాల్పడటం తీవ్రంగా ఖండనీయమని బీఆర్ఎస్వీ టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా “ఆరు గ్యారంటీలు” ప్రకటించిందని గుర్తుచేశారు. అందులో ఉద్యమకారులకు గుర్తింపు కార్డు,250 గజాల ఇల్లు స్థలం, ₹25,000 పెన్షన్ ఇవ్వాలని హామీ ఇచ్చినప్పటికీ, రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. ఈ హామీల […]
మృతుడి కుటుంబానికి ప్రమాద బీమా చెక్కు అందజేత
“సాయం… సెల్ఫీ… ఓటీపీ… — ఒక్క క్షణం నిర్లక్ష్యం, జీవితాంతం నష్టం!”
జర్నలిస్టులను అరెస్టు చేయడం అన్యాయం

టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కోకన్వీనర్ కే బాపురావు కరీంనగర్/ధనాధన్ న్యూస్:ఎన్టీవీ మీడియాలో ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ప్రసారమైన కథనంపై ఎటువంటి విచారణ చేయకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా సిట్ పోలీసులు ఓ ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఎన్టీవీలో వచ్చిన కథనానికి జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్ లను బాధ్యులను చేస్తూ ‘సిట్’ పోలీసులు ముందస్తునోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం దారుణమని […]
ఐబొమ్మపై సీపీఐ నారాయణ సంచలనం

హైదరాబాద్: సీపీఐ సీనియర్ నేత నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్, అలాగే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ అంశాలపై స్పందిస్తూ ఆయన వ్యవస్థాగత లోపాలను తీవ్రంగా దుయ్యబట్టారు.ఐబొమ్మలో సినిమాలు చూసిన నారాయణఐబొమ్మ వ్యవహారంపై మాట్లాడిన నారాయణ, తాను కూడా ఆ వెబ్‌సైట్‌లో సినిమాలు ఫ్రీగా చూసినట్లు బహిరంగంగా ఒప్పుకున్నారు. “ఆరేడు వందలు పెట్టి సామాన్యులు సినిమాలు ఎలా చూసేది? నేను కూడా ఐబొమ్మలోనే సినిమాలు […]
గోవులను తరలిస్తుండగా కాల్పులు

ధనాధన్ న్యూస్,అక్టోబర్,బుధవారం 22: ఘట్కేసర్ మండల పరిధిలో గోవులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకోవడంతో చోటుచేసుకున్న కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని ఆపేందుకు ప్రయత్నించిన గోరక్షకులు ఎదుర్కొన్న దాడిలో సోను (ప్రశాంత్) అనే యువకుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన యశోద ఆసుపత్రికి చేరుకుని గాయపడిన సోను […]
కల సౌకర్యాలతో మహా మేడారం జాతర – మంత్రి సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్ 03:సమ్మక్క–సారలమ్మల త్యాగ ఔన్నత్యానికి తగిన వేడుకగా మేడారం మహా జాతరను నిర్వహిస్తామని మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. జాతర ప్రారంభానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, వివిధ విభాగాల ఇంజనీర్లు పాల్గొన్నారు. సమ్మక్క–సారలమ్మ పూజారుల సూచనల మేరకు […]
