- మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ,రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న తాజా పరిణామాలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రసంగిస్తున్న సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేయాలని మాదిగ హక్కుల దండోరా(ఎమ్ హెచ్ డి ) డిమాండ్ చేస్తోంది.
నిండు సభలో ఒక దళిత ఎమ్మెల్యేతో బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుని వారి భాషను ఖండిస్తున్నామని మాదిగ హక్కుల దండోరా నాయకులు దండు సురేందర్ మాదిగ రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ తెలిపారు.
హైదరాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రెస్ రిపోర్ట్ లో వారు మాట్లాడుతూ, కడియం శ్రీహరి మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి జోక్యం చేసుకుని అనుచితంగా ప్రవర్తించారని, ముఖ్యంగా, ఒక దళిత నేతను ఉద్దేశించి “గన్‌తో కాల్చి పడేస్తాను” అన్నట్లుగా చేతితో సైగలు చేస్తూ బెదిరించడం అత్యంత హేయమైన చర్య అని మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షుడు దండు సురేందర్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ మండిపడ్డారు. ఎస్ సి లు అంటే అంతా చిన్న చూపా అన్నారు.హుజూరాబాద్ నియోజకవర్గం లో ఆ ఎస్సీల ఓటు ద్వారానే వారు గెలిచారని గెలిపియకపోతే చనిపోతానంటూ ప్రజలందరినీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసిన మహాగణత హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిదని తెలిపారు.అసెంబ్లీలో దళితుల పట్ల అగౌరవంగా, అనుచితంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలనీ వారు డిమాండ్ చేశారు.
సీనియర్ నేత కడియం శ్రీహరికి, శాసనసభకు కౌశిక్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలనీ తెలిపారు. స్పీకర్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఒక దళిత నేతను అగౌరపరచినందుకుగాను కౌశిక్ రెడ్డి పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరారు.ఈ వివాదం ఇప్పుడు ‘దళిత ఆత్మ గౌరవం చుట్టూ తిరుగుతుందని దళితులను చిన్నచూపు చూసి నందు గాను ఒక దళిత నాయకున్ని కాల్చిపడేస్తానంటూ బెదిరించినందుకుగాను కౌశిక్ రెడ్డి వెంటనే అసెంబ్లీలో స్పీకర్ ముందట క్షమాపణ చెప్పాలని తెలిపారు.