సైదాపూర్‌లో బిఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో

సైదాపూర్, సెప్టెంబర్ 2 (ధనాధన్ న్యూస్):సైదాపూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య మాట్లాడుతూ –రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. వారానికి ఒక్కటి రెండు లారీలు యూరియా సరఫరా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై […]

బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 2:భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీకి అనుబంధంగా ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన, పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. సస్పెన్షన్ వెనుక కారణాలు ఇటీవల కాలంలో కవిత పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని, పార్టీకి ఇబ్బందులు కలిగించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. క్రమశిక్షణలో లోపం ప్రదర్శించినందుకు […]

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్, ఆగష్టు 26: తెలంగాణలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ కోసం కీలకమైన ఓటర్ల జాబితా సవరణ పనులను ప్రారంభించింది. హైకోర్టు కీలక తీర్పు 2024 జనవరి 31తోనే తెలంగాణలోని సర్పంచుల పదవీకాలం ముగిసింది. దీంతో గ్రామాల్లో సర్పంచ్ చెక్ పవర్ నిలిచిపోగా, […]

కౌశిక్ రెడ్డి దృష్టి చిల్లర రాజకీయాల మీద-మా దృష్టి అభివృద్ధి మీద

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కేసీఆర్,కేటీఆర్ మెప్పు పొందడానికే కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని,అభివృద్ధిని గాలికి వదిలేసి చిల్లర రాజకీయాల మీద దృష్టి పెడితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్డిఎఫ్ ఫండ్ కింద పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అభివృద్ధి చేస్తున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.మంగళవారం నాడు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి విద్య,వైద్య […]

ఆదివాసి ఎరుకల కులస్తులకు అండగా ఉంటాం

వరంగల్/ధనాధన్ న్యూస్: బిఆర్ఎస్ పార్టీ రజతోఉత్సవ సభ పరిశీలన సందర్భంగా వరంగల్ మీదుగా ఎలుకతుర్తికి వచ్చిన కే కవితక్కని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఆదివాసి ఎరుకల సమస్యల పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు  ( నాంచారమ్మ )  ఎరుకల బుట్టను ఇచ్చి  స్వాగతం  పలికారు.కవితక్క  ఆదివాసి ఎరుకల జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ గత కేసీఆర్ […]

ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ లో  సెయింట్ జోసెఫ్ విద్యార్థినికి స్టేట్ 5వ ర్యాంక్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు  ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ వారు నిర్వహించిన వివిధ  ప్రామాణిక పరీక్షల్లో పోటీపడి జమ్మికుంట సెయింట్ జోసెఫ్ స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్థిని నిహా తన్నజ్ స్టేట్ 5వ ర్యాంక్ సాధించింది. ఇదే స్కూల్ కు చెందిన 7వ తరగతి విద్యార్థిని కే. విశ్వశ్రీ జోనల్ లెవల్ లో 9వ ర్యాంక్ సాధించింది. ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ ఫైనల్ […]

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య  మాట్లాడుతూ ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ ప్రజలు అరిగోసలు పడుతున్న దృశ్యాన్ని చూసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆహార్నిషలు శ్రమించి […]

ఊరుగొండ లో లక్ష్మీనర్సింహస్వామి జాతర మహోత్సవం

దామెర/ధనాధన్ న్యూస్: దామెర మండలం ఊరుగొండ లక్ష్మీనర్సింహస్వామి అధ్యయన కల్యాణ మహోత్సవాలు ఈ నెల 7 నుంచి జరుగనున్నాయి.స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వాహకులు 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.ఈ క్రమంలో జనవరి 7 నుంచి 18 వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్న అధ్యయన కల్యాణ మహోత్సవాలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకోనున్నారు.స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాద్, […]

జర్నలిస్టుల అక్రెడిటేషన్ల జీవో 1395 ను సవరించాలి

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డులకు సంబంధించి నియమ నిబంధనల మార్పు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 1395 లోపభూయిష్టంగా,ఏకపక్షంగా ఉందని, ఈ జీవోను వెంటనే సవరించి ప్రభుత్వం వేసిన అన్ని జర్నలిస్టు సంఘాలకు, చిన్న పత్రికలకు, మహిళా జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, బండి విజయ్ కుమార్,ఎల్గొయి ప్రభాకర్, […]

ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఇక లేరు

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: డిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా కన్నుమూశారు.నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన శనివారం(అక్టోబర్ 12) తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన సాయిబాబా ఈమధ్యనే జైలు నుంచి విడుదల అయ్యారు.నక్సలైట్లతో చేతులు కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని 2014లో మహారాష్ట్ర పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.ఈ కేసులో 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయనతో పాటు మరో ఆరుగురికి […]