డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇల్లందకుంట ఎస్సై కాంత్రికుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మండల కేంద్రంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై కాంత్రికుమార్ మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం వల్ల సమాజంలో ఏర్పడే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత సరదాగా ప్రారంభించే ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా […]

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ సూచించారు.బుధవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ తదితర అవసరమైన పత్రాలను […]

హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 23: రాష్ట్రంలోని అన్ని రంగాల హమాలి కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం బొమ్మకల్ సిమెంట్ గోదాముల హమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని సిమెంట్ గోదాముల్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు పని భద్రత […]

ఎస్బీఐ లైఫ్ కార్యాలయంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ఫాదర్స్ డే సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని ఎస్బీఐ లైఫ్ కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో పాలసీలు కలిగిన ఐదుగురు తండ్రులను లైఫ్ మిత్ర తవటం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో, కుటుంబ వ్యవస్థలో తండ్రులకు ప్రత్యేక స్థానం ఉండటంతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంలో వారి పాత్ర కీలకమని ఎస్బీఐ […]

గ్రామ దేవతల ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఊర్లను కాపాడే అమ్మవార్లు ప్రజలకు ఇష్టమైన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం రోజున జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో గ్రామ దేవతలైన శ్రీ మహాలక్ష్మి,భూ లక్ష్మీ,నాభి శిల (బొడ్రాయి),పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం పోచమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగ్గయ్యపల్లి గ్రామంలో […]

అద్దాల మేడలు, ప్లాస్టిక్ బొమ్మలు చూసి మోసపోకండి…!

జమ్మికుంట/ధనాధన్ న్యూస్, జూన్ 18: అద్దాలమేడలు, ప్లాస్టిక్ బొమ్మలు మీ పిల్లల భవిష్యత్తును మార్చలేవు, పిల్లలకు కావాల్సింది చదువు పొందాల్సిందే విజ్ఞానం “తోటోడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా ” అనే చందంగా ఉన్నది మన తల్లిదండ్రుల పరిస్థితి చిన్నపిల్లల చదువు కోసం లక్షల రూపాయలు వెచ్చించి అనవసరంగా ఆర్థిక నష్టాలు పొంది అప్పుల పాలవుతున్న పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే నేను పెద్ద స్కూల్లో […]

శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 17: జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామంలో నిర్వహించిన శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. […]

డా.బి.ఆర్.అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రతి పౌరుడు తెలుసుకోవాలి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 14:జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మెట్రో ఉదయం జిల్లా స్టాఫ్ రిపోర్టర్, సీఎంపీ న్యూస్ ఛానల్ అధినేత మల్యాల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. […]

గండి రంజిత్ కుమార్ గౌడ్‌కు తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జూన్ 13: ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ మీడియా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు గండి రంజిత్ కుమార్ గౌడ్‌కు ప్రతిష్టాత్మక తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారం లభించింది.జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో వరంగల్‌లోని టీఎన్‌జీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.దాదాపు […]

జగిత్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ఐఎంఏ ముందడుగు

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 13: మాదకద్రవ్యాల వ్యసన నిర్మూలనకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించనున్న “యాంటీ డ్రగ్ 3కే రన్” కార్యక్రమ కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువతను లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న మాదకద్రవ్యాల వ్యసనం దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ దుర్వినియోగంపై ప్రజల్లో, ముఖ్యంగా […]