ప్రజల పక్షాన పోరాడే సీపీఐని బలోపేతం చేద్దాం

కరీంనగర్/ధనాధన్ న్యూస్, జూన్ 27: ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)ని బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై సంఘటితంగా ఉద్యమాలు నిర్వహించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.శనివారం గుంటూరుపల్లి గ్రామంలో సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ […]
చనిపోయిన కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

బుగ్గారం/ధనాధన్ న్యూస్, జూన్ 27(చుక్క గంగారెడ్డి,సీనియర్ జర్నలిస్ట్): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన ఆత్మహత్య చేసుకున్న దళిత కౌలు రైతు మానాల పెద్ద దుబ్బయ్య (60) కుటుంబాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం పరామర్శించారు.మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధిత […]
పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, వారికి రావాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపులో విఫలమైందని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి విమర్శించారు.బుధవారం జమ్మికుంటలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు డీఏలను విడుదల చేస్తామని, పీఆర్‌సీని ప్రకటించి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు ఆ హామీలను అమలు చేయలేదని […]
డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇల్లందకుంట ఎస్సై కాంత్రికుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మండల కేంద్రంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై కాంత్రికుమార్ మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం వల్ల సమాజంలో ఏర్పడే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత సరదాగా ప్రారంభించే ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా […]
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ సూచించారు.బుధవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ తదితర అవసరమైన పత్రాలను […]
హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 23: రాష్ట్రంలోని అన్ని రంగాల హమాలి కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం బొమ్మకల్ సిమెంట్ గోదాముల హమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని సిమెంట్ గోదాముల్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు పని భద్రత […]
ఎస్బీఐ లైఫ్ కార్యాలయంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ఫాదర్స్ డే సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని ఎస్బీఐ లైఫ్ కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో పాలసీలు కలిగిన ఐదుగురు తండ్రులను లైఫ్ మిత్ర తవటం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో, కుటుంబ వ్యవస్థలో తండ్రులకు ప్రత్యేక స్థానం ఉండటంతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంలో వారి పాత్ర కీలకమని ఎస్బీఐ […]
గ్రామ దేవతల ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఊర్లను కాపాడే అమ్మవార్లు ప్రజలకు ఇష్టమైన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం రోజున జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో గ్రామ దేవతలైన శ్రీ మహాలక్ష్మి,భూ లక్ష్మీ,నాభి శిల (బొడ్రాయి),పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం పోచమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగ్గయ్యపల్లి గ్రామంలో […]
అద్దాల మేడలు, ప్లాస్టిక్ బొమ్మలు చూసి మోసపోకండి…!

జమ్మికుంట/ధనాధన్ న్యూస్, జూన్ 18: అద్దాలమేడలు, ప్లాస్టిక్ బొమ్మలు మీ పిల్లల భవిష్యత్తును మార్చలేవు, పిల్లలకు కావాల్సింది చదువు పొందాల్సిందే విజ్ఞానం “తోటోడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా ” అనే చందంగా ఉన్నది మన తల్లిదండ్రుల పరిస్థితి చిన్నపిల్లల చదువు కోసం లక్షల రూపాయలు వెచ్చించి అనవసరంగా ఆర్థిక నష్టాలు పొంది అప్పుల పాలవుతున్న పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే నేను పెద్ద స్కూల్లో […]
శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 17: జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామంలో నిర్వహించిన శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. […]
