
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ఫాదర్స్ డే సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని ఎస్బీఐ లైఫ్ కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో పాలసీలు కలిగిన ఐదుగురు తండ్రులను లైఫ్ మిత్ర తవటం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో, కుటుంబ వ్యవస్థలో తండ్రులకు ప్రత్యేక స్థానం ఉండటంతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంలో వారి పాత్ర కీలకమని ఎస్బీఐ డివిజనల్ సీనియర్ మేనేజర్ సతీష్, యూనిట్ మేనేజర్ బి. రమేష్ పేర్కొన్నారు.

కుటుంబ భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి తండ్రి కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం అవసరమని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో కడవెరువు సత్యం, వోడ్నాల రామకృష్ణ, మంచికట్ల సమ్మయ్య, సందుపట్ల సదానందం, రాజు తదితరులను శాలువాలతో సన్మానించి స్వీట్లు అందజేశారు. కార్యక్రమంలో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు, కార్యాలయ సిబ్బంది, పలువురు తండ్రులు పాల్గొన్నారు