ఎన్నికల్లో గెలిపిస్తే కటింగ్-షేవింగ్ ఫ్రీ!

సిద్దిపేట/ధనాధన్ న్యూస్: సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం, రఘోత్తంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు… ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్! ఏంటీ అంత స్పెషల్ అంటే… ఇక్కడ పోటీ చేస్తున్న ఒక వార్డు సభ్య అభ్యర్థి భర్త ఇచ్చిన హామీ మామూలుగా లేదు. అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ కామన్. కానీ ఈయన ఇచ్చింది మాత్రం పక్కా “మెస్మరైజింగ్ ఆఫర్”! ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్, షేవింగ్!రఘోత్తంపల్లిలో తన భార్య వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తుండగా, ఆమె భర్త, […]

సైదాపూర్‌లో బిఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో

సైదాపూర్, సెప్టెంబర్ 2 (ధనాధన్ న్యూస్):సైదాపూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య మాట్లాడుతూ –రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. వారానికి ఒక్కటి రెండు లారీలు యూరియా సరఫరా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై […]

బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 2:భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీకి అనుబంధంగా ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన, పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. సస్పెన్షన్ వెనుక కారణాలు ఇటీవల కాలంలో కవిత పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని, పార్టీకి ఇబ్బందులు కలిగించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. క్రమశిక్షణలో లోపం ప్రదర్శించినందుకు […]

నిరుద్యోగుల యువతి యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో తేదీ జూలై  21 2025 సోమవారం రోజున  హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా  జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని బిఆర్ఎస్వి టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ ఓ ప్రకటనలో తెలిపారు. హుజురాబాద్ నియోజవర్గం లో ఉన్నటువంటి నిరుద్యోగులు టెన్త్, ఇంటర్మీడియట్,డిగ్రీ,పీజీ,బీటెక్, చదువుకున్న ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం  చేసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది వారు తెలిపారు. అదేరోజు రిక్రూట్మెంట్ కూడా […]

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు గ్రామ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలనీ బిఆర్ఎస్ కొత్తపల్లి మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ఆకుల రవీందర్ పటేల్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ రజతోత్సవ సభ కానీ విని ఎరుగని రీతిలో జరగనుందని రవీందర్ పటేల్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27న జరగనున్న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కెసిఆర్ మాటల కోసం అన్ని వర్గాల ప్రజలంతా […]

ఘనంగా డాక్టర్ రమేష్ జన్మదిన వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన వైద్యరత్న, ప్రముఖ సీనియర్ వైద్యులు, యువ వైద్య కిషోరం డాక్టర్ తిప్పిరిశెట్టి రమేష్ జన్మదిన వేడుకలు  అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.గ్రామానికి చెందిన ప్రముఖులు,యువకులు,వివిధ రాజకీయ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు భారీ సంఖ్యలో హాజరై డాక్టర్ రమేష్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు […]

గ్రామ సభ విజయవంతానికి సహకరించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో నూతనంగా ఏర్పడిన గర్రెపల్లి  గ్రామ పంచాయతీ ఆవరణంలో గురువారం చేపట్టనున్న మొట్టమొదటి గ్రామ సభను ప్రజలు విజయవంతం చేయాలని అదే గ్రామానికి చెందిన దోకిడి తిరుపతి తెలిపారు.ప్రజల ఇన్ని నాళ్ల కల ఈరోజు తొలి గ్రామపంచాయతీ ఏర్పడడం ద్వారా తీరిందని తెలిపారు.ఇన్నాళ్లు సోమారం గ్రామానికి అనుబంధంగా గర్రెపల్లి గ్రామం ఉందని ఇప్పుడు కొత్తగా గ్రామపంచాయతీ ఏర్పాటుతో ఆనందం వ్యక్తం చేశారు.గ్రామంలోని ప్రజలు అర్హులైన ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణం […]

కౌశిక్ రౌడీయిజాన్ని కేటీఆర్ సమర్దిస్తున్నారా

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఎమ్మెల్యే  పాడి కౌశిక్ రెడ్డి ఓసారి మెంటల్ హాస్పిటల్ లో చూపించుకోవాలని, ఆ పిచ్చి ముదిరితే బీఆర్ఎస్ పార్టీకే నష్టమని,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించండి అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి రోజురోజుకు […]

త్వరలో జమ్మికుంటలో మెగా జాబ్ మేళా

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సబ్బని వెంకట్ ఆధ్వర్యంలో హుజురాబాద్ కి ప్రాముఖ్యాన్నిస్తూ,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని వేల మంది నిరుద్యోగ యువతీ యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్చి నెలలో జమ్మికుంట పట్టణ కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తారని సబ్బని వెంకట్ వ్యక్తిగత సహాయకులు అర్జున్ మేడుదల,అరవింద్ అక్కేపల్లి తెలిపారు. నియోజక వర్గంలో ఉన్న యువత అవకాశాల కోసం వెంకట్ ని సంప్రదిస్తున్న సందర్భంగా, ఇటీవల ఐటీ కంపెనీలు , బ్యాంకులు,ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ , […]

నువ్వు మొగోడివి అయితే.. రాజీనామా చేసి మళ్ళీ గెలువు

ఫైల్ ఫోటో హుజురాబాద్/ధనాధన్ న్యూస్: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన దాడిని ఖండిస్తున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.వారు మాట్లాడుతూ పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి చిల్లర పనులు ఏరోజు చేయలేదని పార్టీ ఫిరాయింపులపై గగ్గోలు పెట్టే ఎమ్మెల్యే తను ఏ పార్టీ నుంచి ఫిరాయించి బిఆర్ఎస్ లో చేరాడో తెలుసుకోవాలని సూచించారు.సంవత్సరం గడుస్తున్నా కౌశిక్ రెడ్డికి అధికారం మదం […]