సమస్యల నిలయంగా మాదారం ఆశ్రమ పాఠశాల

మహాముత్తారం, జూలై 30(ధనాధన్ న్యూస్): మండలంలోని మాదారం ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (డీటీడబ్ల్యూఓ)పై చర్యలు తీసుకోవాలని ఆర్‌వైఏ (RYA), ఏఐఎస్‌ఏ (AISA), కేవీపీఎస్ (KVPS) జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఏడాది కాలంగా మాదారం ఆశ్రమ పాఠశాల అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. విద్యార్థులకు వంటలో నాణ్యతలేని పామ్ ఆయిల్ వినియోగిస్తున్నారని, దీనివల్ల వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం […]

పెద్ద వాగులో ప్రమాదకరంగా పెరిగిన వరద ప్రవాహం

మహా ముత్తారం, జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం నిమ్మగూడెం–పెగడపల్లి గ్రామాల మధ్య ఉన్న పెద్ద వాగులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా నిమ్మగూడెం గ్రామపంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు.వాగు దాటే మార్గంలో గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను అడ్డంగా నిలిపి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. నీటి ప్రవాహం తగ్గే వరకు ఎవరూ వాగును దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు […]

పెగడపల్లిలో ఘనంగా శీతలా భవాని జాతర వేడుకలు

పెగడపల్లి,జూలై 28(ధనాధన్ న్యూస్): పెగడపల్లి గ్రామంలో బంజారా సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించే శీతలా భవాని పండుగను మంగళవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. తండా పెద్ద పర్తి నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, పాడి పశుసంపద సమృద్ధిగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని శీతలా భవాని అమ్మవారిని ప్రార్థించారు. తమ మొక్కుబడుల మేరకు మేకపోతులను సమర్పించి ప్రత్యేక […]

రాహుల్ గాంధీ అరెస్టు ఖండిస్తూ మహా ముత్తారంలో కాంగ్రెస్ నిరసన

మహా ముత్తారం,జూలై 23 (ధనాధన్ న్యూస్): ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులను పోలీసులు నిర్బంధించడాన్ని ఖండిస్తూ మహా ముత్తారం మండలం యామన్‌పల్లి చౌరస్తాలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పక్కల సడవలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు […]

ఉపాధిహామీ కూలీలకి యోగ శిక్షణ

మహాముత్తారం(ధనాధన్ న్యూస్)మే22:మహాముత్తారం మండలంలోని పెగడపల్లి గ్రామంలో జాతీయ ఉపాధిహామీ కూలీలకి జాతీయ యోగ శిక్షణ అధ్యాపకుడు వావిల్ల కిష్టయ్య శిక్షణ ఇస్తూ యోగ వలన జరిగే ప్రయోజనాలను కూలీలకి వివరించడం జరిగింది.ప్రతిరోజూ ఐదు నిమిషాలు ధ్యానం చేయడం వలన మనిషిని పట్టిపిడిస్తున్న  సైకో సోమటిక్ వ్యాధులు మానసిక వ్యాధులు భయం, కోపం,భద్రత భావము మొదలైన వ్యాధులను నయం చేయవచ్చునని,కరోన,గుండె సంబంధిత వ్యాధులు ధ్యానం తో నయం చేయవచ్చునని ఉపాధి హామీ కూలీలకి పని సామర్ధ్యమును పెంచడంతో పాటు […]