

పెగడపల్లి,జూలై 28(ధనాధన్ న్యూస్): పెగడపల్లి గ్రామంలో బంజారా సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించే శీతలా భవాని పండుగను మంగళవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. తండా పెద్ద పర్తి నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, పాడి పశుసంపద సమృద్ధిగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని శీతలా భవాని అమ్మవారిని ప్రార్థించారు. తమ మొక్కుబడుల మేరకు మేకపోతులను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, తండావాసులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని పండుగను విజయవంతం చేశారు. భక్తుల రద్దీతో తండా ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
