ఎన్నికల షెడ్యూల్‌పై ఈటల రాజేందర్ ఆగ్రహం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ :స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై ఎంపీ ఈటల రాజేందర్ మండలాల వారీగా పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కమలాపూర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లలో పెద్ద ఎత్తున తప్పులు ఈటల మాట్లాడుతూ – రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన రిజర్వేషన్లలో అనేక పొరపాట్లు జరిగాయని అన్నారు.బీసీలు లేని తండాలకు బీసీ రిజర్వేషన్, ఎస్సీలు లేని గ్రామాలకు ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. “కోర్టుకు వెళ్లొద్దని ఎందుకు అంటున్నారు?” “ఎంపెరికల్ … Read more

మీ తాటాకు సప్పుళ్లకు బయపడేటోళ్ళం కాదు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట పట్టణంలో శనివారం కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ చేసిన పత్రికా ప్రకటనలో తమపై చేసిన ఆరోపణలను జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు కొలకాని రాజు ఖండించారు. వాట్సాప్ గ్రూపులో నిధులు తానే తెచ్చుకున్నట్టు చెప్పుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం పూర్తిగా తప్పుడు వాదమని ఆయన స్పష్టం చేశారు. కొలకాని రాజు మాట్లాడుతూ – “మేము బిజెపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించామని, స్పందన … Read more

ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ కు భారత్ వరల్డ్ రికార్డు అవార్డు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ పట్టణానికి చెందిన మానవ విలువల పరిరక్షణ సేవ సంస్థ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంటర్నేషనల్ భారత్ ప్రతిభ రత్న అవార్డు గ్రహీత, ప్రజాకవి, రచయిత సామాజికవేత్త డాక్టర్ నాగుల సత్యం గౌడ్ భారత్ వరల్డ్ రికార్డ్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డు కమిటీ సత్యం గౌడ్ సామాజిక, ఆధ్యాత్మిక సేవలను సేవలను గుర్తించి, చతుష్టి కలలు, సంక్రాంతి సంబరాలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రపంచ భారత్ … Read more

సైదాపూర్ మండల బిజెపి పార్టీ నూతన అధ్యక్షుడిగా దెంచనాలా శ్రీనివాస్

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని అమ్మనగుర్తి  గ్రామానికి చెందిన దెంచ నాలా శ్రీనివాస్ గతంలో బిజెపి యువమోర్చా మండల అధ్యక్షులుగా,బిజెపి మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పని తీరును గుర్తించి ప్రస్తుతం రాష్ట్ర పార్టీ నాయకత్వం నూతన అధ్యక్షుల నియామకంలో భాగంగా దెంచనాల శ్రీనివాస్ ను గురువారం రోజున బిజెపి మండల పార్టీ అధ్యక్షులుగా సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి సారంగుల అమర్నాథ్ ప్రకటించినట్లు శ్రీనివాస్ ప్రకటన లో తెలిపారు.నూతన బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు … Read more

కార్యకర్తలే బీజేపీ పార్టీకి బలం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సభ్యత్వ నమోదు అనేది పార్టీకి పునాది లాంటిదని,కార్యకర్తలే బిజెపి పార్టీ బలం అని  జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు అన్నారు.ఈరోజు వీణవంక మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యాశాల (సన్నాహక సమావేశం)  జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఎరబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ దేశంలో ఉన్న అత్యధిక రాజకీయ పార్టీలు కొంత మంది వ్యక్తుల మీద ఆధారపడి ముందుకు … Read more

న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: జనగామ పట్టణంలో న్యాయవాద దంపతులపై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం హుజురాబాద్ కోర్టు ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని,న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిని వ్యతిరేకిస్తూ గురు,శుక్రవారాలు న్యాయవాదులు తమ కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియన్ ప్రధాన … Read more

విద్యార్థుల జుట్టు కట్ చేసిన ఉపాధ్యాయురాలు

ఖమ్మం/ధనాధన్ న్యూస్: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ ప్రభుత్వ హైస్కూల్లో టీచర్ విద్యార్థుల జుట్టు కట్‌ చేయడం కలకలం రేపింది.దీంతో టీచర్ తీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు.టీచర్ కత్తిరించడంతో విద్యార్దులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.టీచర్ శిరీష అమానుషంగా ప్రవర్తించడం సరియైనది కాదని పేరెంట్స్ తో కలిసి ప్రధాన ఉపాధ్యాయుడు వద్ద ఆందోళన చేశారు.ప్రభుత్వ హై స్కూల్ లో 6,7,8,9,10 తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌ టీచర్ కత్తెరతో … Read more

భార్యను చూడటానికి బస్సును ఎత్తుకెళ్ళిన భర్త

నందికొట్కూరు/ధనాధన్ న్యూస్: భార్యను చూడటానికి ఏకంగా ఏపిఎస్ ఆర్టీసి బస్సునే ఎత్తుకెళ్లాడు ఓ భర్త.బస్ దొంగతనం విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును ఆపి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నా భార్య ఇదే గ్రామంలో ఉంటుందని,నా భార్యను చూసేందుకు వాహనాలేవి లేకపోవడంతో చూస్తున్న క్రమంలో బస్టాండ్ లో బస్సు ఉందని,తాళాలు బస్సుకే ఉండటంతో బస్సును తెచ్చుకున్నానని పోలీసులకు సమాధానం ఇచ్చాడు.ఈ సంఘటన పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో చోటుచేసుకుంది..

వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం  మూడవసారి  ఏర్పడ్డాక ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్  పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పై స్పందించిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం వికసిత భారత లక్ష్యంగా పనిచేస్తుందని,దానికి అనుగుణంగా ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా కేంద్ర బడ్జెట్ రూపొందించారని సంపత్ రావు … Read more