ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు

కాటారం,జూలై 30(ధనాధన్ న్యూస్): కాటారం మండలంలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే, ఈ వర్షాలతో వరి పొలాలు నీటితో నిండిపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు క్రమంగా నిండుతుండటంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.నిరంతర వర్షాల కారణంగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ […]

భారీ వర్షానికి ఇళ్లు కూలి నిరాశ్రయమైన నిరుపేద కుటుంబం

కాటారం, జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల మల్లయ్య ఇంటి గోడలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గోడలు కూలిపోవడంతో ఇంటిలో నివసించడం ప్రమాదకరంగా మారి, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఈ ఘటనపై స్పందించిన ఎర్రగుంటపల్లి గ్రామ యువత, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అత్యవసర ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని […]

బడి బాటకి విస్తృత ప్రచారం

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్10:సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు మండలంలోని సైదాపూర్,వెన్కేపల్లి,జాగిరిపల్లి,గర్రెపల్లి,ఘనపూర్,బొత్తలపల్లి, రామచంద్రాపూర్,కురుమపల్లి,దుద్దేనపల్లీ గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ విద్యార్థులకు, ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఉపాద్యాయులు విస్తృత ప్రచారం చేస్తు అవగాహన కల్పిస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు, డిజిటల్  విద్యాబోధన,అత్యాధునిక సౌకర్యాలు,ఉచిత పుస్తకాలు,సన్నబియ్యంతో నాణ్యమైన ఉచిత మధ్యాహ్న బిజనంతో పాటు యునిఫాం ఇస్తున్నట్లు ఉపాద్యాయులు చెబుతున్నారు.ఈ విద్యాసంవత్సరం వెన్కేపల్లి పాఠశాలలో 10వ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు.మానసిక […]

డైలాగులతో ఓట్ల రాజకీయం

వీణవంక(ధనాధన్ న్యూస్)మే 06:డైలాగులతో ఓట్ల రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్న రాజకీయ నాయకులకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా వీణవంక మండలంలోని మామిడాల పల్లి ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కష్టపడితేనే దేవుడు ఫలితాన్ని అందిస్తాడని,దేవుడి ఫోటో పెట్టుకుని అక్షింతలు వచ్చాయా అంటూ రాజకీయాలు చేయడం సరైనది కాదన్నారు.పేద బడుగు బలహీన […]

పోలీసులకు పుష్ప 3 సినిమా ట్రైలర్ చూపించిన జాదుగాడు

ఖమ్మం(ధనాధన్ న్యూస్)మే 01:పోలీసుల కళ్లుగప్పి నోట్ల కట్టల్ని తరలించడానికి కొత్తకొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నారు లీడర్లు. అలాంటి చావు తెలివి తేటలతో డబ్బు తరలిస్తూ దొరికిపోయాడు ఓ యువకుడు.అది కూడా పుష్ప మూవీ తరహాలో కానీ,పోలీసుల ముందు అతడి ఆటలు చెల్లలేదు.ఖమ్మంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు 15లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు నిందితుడు.ముందు పోలీసులకు అనుమానమే రాలేదు.కానీ,కొంచెం తేడాగా ఉండటంతో అతడ్ని తనిఖీ చేశారు.అంతే,కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.ముందు,ప్యాంట్‌ జేబుల్లో నుంచి నోట్ల కట్టల్ని బయటికి తీశాడు.ఆ తర్వాత […]

మహిళామణులు మీ ప్రేమా అభిమానాలు చాటాలే!

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 28:ఈ నెల 30 న జమ్మికుంట డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ కోరారు. ఆదివారం జమ్మికుంట ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మహిళా నాయకులతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి జమ్మికుంటకు వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ […]

బాబా సాహెబ్ విగ్రహానికి నివాళులు అర్పించిన వొడితల ప్రణవ్

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:భారత రాజ్యంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహనికి హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పూలమాల వేసి,నివాళి అర్పించారు. ఈ కార్యక్రమం లో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

క్రమశిక్షణతో జరుపుకునే పండుగ రంజాన్

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11:ప్రపంచ దేశాలలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత కఠిన ఉపవాస దీక్షలతో క్రమశిక్షణతో నియమ నిబంధనలను పాటిస్తూ రంజాన్ మాసాన్ని పవిత్ర మాసంగా పరిగణిస్తూ ప్రార్థనలు చేయడం జరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ అన్నారు.హుజూరాబాద్,జమ్మికుంట పట్టణంలోని  ఈద్గాల వద్ద ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరికొకరు […]

మాదిగల ద్రోహి కాంగ్రెస్ పార్టీని ఓడించండి

హుజురాబాద్ ఏప్రిల్ 08:హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం హుజురాబాద్ లోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో మహాజన సోషలిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ అధ్యక్షతన జరిగింది .ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ , ఇందిరా గాంధీ కాలము నుండి నేటి రాహుల్ గాంధీ  వరకు అధిక జనాభా కలిగిన మాదిగలు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి […]

ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి

కరీంనగర్ ఏప్రిల్08:ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు,మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డి ఆర్ డి ఓ ఉప్పుల శ్రీధర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో ఉపాధిహామీ కూలీలకు […]