కాటారం, జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల మల్లయ్య ఇంటి గోడలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గోడలు కూలిపోవడంతో ఇంటిలో నివసించడం ప్రమాదకరంగా మారి, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఈ ఘటనపై స్పందించిన ఎర్రగుంటపల్లి గ్రామ యువత, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అత్యవసర ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ నిరుపేద కుటుంబం భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిందని వారు పేర్కొన్నారు.


“కూలిపోయినవి కేవలం ఇంటి గోడలు మాత్రమే కాదు… ఒక పేద కుటుంబం ఆశలు, నమ్మకాలు కూడా. అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి మల్లయ్య కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలి” అని గ్రామ యువత విజ్ఞప్తి చేసింది.
కూలిపోయిన ఇంటిని 10వ వార్డు సభ్యులు మానేమ్ రాజబాపు, గొనె రవి, సంబరాతి మనోహర్‌తో పాటు ఎర్రగుంటపల్లి గ్రామ యువత పరిశీలించి, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు.

Leave a Reply