పోచమ్మ తల్లి దేవాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దంపతుల ప్రత్యేక పూజలు

జగిత్యాల, ధనాధన్ న్యూస్: పట్టణంలోని పురాణిపేట శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం 64వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఆశీస్సులతో జగిత్యాల పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సమిండ్ల వాణి శ్రీనివాస్ […]

నర్సింగాపూర్‌లో 22 ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

జగిత్యాల రూరల్, ధనాధన్ న్యూస్: ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు నర్సింగాపూర్ గ్రామంలో 22 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ కుక్కునూరు వంశీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాలు, రహదారులను కవర్ చేసేలా సీసీ కెమెరాలను అమర్చారు. కెమెరాల ప్రారంభ కార్యక్రమానికి జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై ఉమాసాగర్ హాజరై ప్రారంభించారు. […]

ఆర్టీఐ దరఖాస్తుల వల్లే ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఆగిపోయాయా?

బుగ్గారం/ధనాధన్ న్యూస్: బుగ్గారం మండలంలో ఆర్టీఐ దరఖాస్తుల కారణంగానే 40 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రావాల్సిన బిల్లులు నిలిచిపోయాయంటూ కొన్ని దినపత్రికల్లో వచ్చిన వార్తలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని సీనియర్ ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం బుగ్గారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కు వినతిపత్రం సమర్పించారు. ఎంపీడీవో తరఫున ఎంపీవో బింగి సురేష్ వినతిపత్రాన్ని స్వీకరించారు. ఆర్టీఐ దరఖాస్తుల వల్లే ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు […]

కోరుట్లలో తెలంగాణ శ్రీనివాసులు సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

జగిత్యాల/ధనాధన్ న్యూస్: కరీంనగర్ తెలంగాణ శ్రీనివాసులు సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ఊట్కూరి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలో తెలంగాణ శ్రీనివాసులు సేవా సంస్థ, కోరుట్ల శ్రీనివాస్ మిత్రుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 20 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.ఈ రక్తదాన శిబిరాన్ని కోరుట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్, […]

మహిళా మండలి భూమి కబ్జా నిరూపణ ఐతే..

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మహిళ మండలి స్థలంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, మహిళ మండలి స్థలం కబ్జాకు గురైందని కొందరు సామాజిక కార్యకర్తలు మరియు 28వ వార్డు ప్రజలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సంబంధిత స్థలాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించినట్లు ఆయన చెప్పారు. అలాగే స్థానిక ప్రజల […]