హుజూరాబాద్, ఆగస్టు 30: అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర మూడో మహాసభలను పురస్కరించుకుని హుజూరాబాద్ మండలం ఇందిరానగర్‌లో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పోలోజు రంజిత్ కుమార్, హుజూరాబాద్ మండల అధ్యక్షురాలు చిట్టి లావణ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలోజు రంజిత్ కుమార్, చిట్టి లావణ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలు, విద్యారంగంలో నెలకొన్న సవాళ్లు, ఉపాధి అవకాశాల కల్పన, యువత రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన ప్రధాన లక్ష్యాలుగా ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడో మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


రాబోయే రోజుల్లో యువతను మరింత చైతన్యపరిచి, వారి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించేందుకు మహాసభలు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రాంతంలోని యువకులు, విద్యార్థులు, ఏఐవైఎఫ్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాష్ట్ర మూడో మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు, ప్రతినిధులు గంగేటి సరళ, పెండాల లావణ్య, ప్రసాద్, చెలిక ప్రసాద్, సతీష్, రాజిరెడ్డి, రాజయ్యతో పాటు పలువురు స్థానిక యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply