పండుగల వేళ వాట్సాప్ స్కాంల మోత

By dhanadhannews.com

  • అమాయకులే టార్గెట్.. వాట్సాప్ లో స్పీడ్ గా షేర్ అవుతున్న ఫేక్ మెసేజ్..
  • పైసల కోసం ఆశపడ్డవా అంతే సంగతి..
  • మొదట ఇది నకిలీ అనుకున్నాను, కానీ నిజంగా నాకు ₹5,000 వచ్చింది! మీరు కూడా ప్రయత్నించి చూడండి!
    పండుగ రోజున వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ అవుతుంది. అంత ఫేక్

కరీంనగర్/ధనధన్ న్యూస్: పండుగ వాతావరణం నెలకొన్న సమయంలో వాట్సాప్ ద్వారా స్కాం మెసేజెస్ ఊపందుకుంటున్నాయి.ప్రత్యేకంగా “మీకు ₹5,000 వచ్చాయి”అనే తరహా సందేశాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.ఈ మెసేజెస్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాట్సాప్ ల్లోనూ విస్తృతంగా ఫార్వర్డ్ అవుతున్నాయి.తెలియని లింక్‌పై క్లిక్ చేస్తే డబ్బు వస్తుందని నమ్మించే ప్రయత్నం జరుగుతోంది.ఇది పూర్తిగా సైబర్ మోసమేనని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఫోన్‌లో హానికర సాఫ్ట్‌వేర్ ప్రవేశిస్తుందని చెబుతున్నారు.దీంతో బ్యాంక్ ఖాతాలు, యూపీఐ యాప్‌లు ప్రమాదంలో పడుతున్నాయని సమాచారం.ఇప్పటికే పలువురు బాధితులు తమ ఖాతాల నుంచి డబ్బులు పోయాయని ఫిర్యాదులు చేశారు.కొన్ని సందర్భాల్లో వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని తెలిపారు.ఈ నేపథ్యంలో స్థానిక సైబర్ పోలీసులు ప్రజలకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి లింక్స్ వస్తె వాట్సప్ కి రిపోర్ట్ కొట్టండి. అలాగే వెంటనే ఆ massages ను డిలీట్ చేయండి. మీ వాట్సప్ గ్రూప్ లో వస్తున్న ఫేక్ మెసేజ్ పై మీ గ్రూప్ సభ్యులను అలెర్ట్ చేయండి..