జమ్మికుంట/ధనాధన్ న్యూస్,సెప్టెంబర్ 3:
జమ్మికుంటలో ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దంపతులు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే,తనుగుల గ్రామానికి చెందిన బొల్లు మధుకర్ రెడ్డి తన భార్య బొల్లు శ్రీలతతో కలిసి ద్విచక్ర వాహనంపై (AP 15 AY 9284) ఆగస్టు 27న జమ్మికుంటకు వచ్చారు. పని ముగించుకొని తిరిగి తనుగుల గ్రామానికి వెళ్లే క్రమంలో, జమ్మికుంట ఫ్లైఓవర్ వద్దకు చేరుకునే సరికి, వెనుక నుంచి అతివేగంగా నుంచి వచ్చిన కారు (TS 02 FC 5444) ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మధుకర్ రెడ్డి చేతులు, కాళ్లకు గాయాలు కాగా, ఆయన భార్య శ్రీలత తలకు గాయమయ్యింది. కారు నడిపిన వ్యక్తి రెండ్ల మురళీకృష్ణ (తండ్రి సంపత్, గ్రామం రామన్నపల్లి) అని గుర్తించారు.
చికిత్స నిమిత్తం ఫిర్యాదు ఆలస్యమైందని బాధితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
