సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఒడితల ప్రణవ్

By dhanadhannews.com

వీణవంక, ధనాధన్ న్యూస్:

వీణవంక మండలంలోని చల్లూరు గ్రామ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ శనివారం పరిశీలించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ… జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జాతర కమిటీ అధ్యక్షున్ని ఆదేశించారు. భక్తుల కోసం మంచి నీరు, విద్యుత్ సమస్య లేకుండా చూడాలని అన్నారు. అనంతరం జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ గడ్డం కుమార్, మాజీ మార్కేట్ చైర్మన్ వాల బాలకిషన్ రావు, మాజీ సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు రఘుపాల్ రెడ్డి, మైనారిటీ సెల్ వీణవంక మండల అధ్యక్షుడు ఎండి ఎజాస్, మల్లారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి, చల్లూరు గ్రామ అధ్యక్షుడు పెద్ది సంపత్ రెడ్డి, పంజాల అనూష – సతీష్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ మండల అధ్యక్షులు కొల్లూరి కిరణ్, నాయకులు సతీష్, ప్రశాంత్, గంట కిరణ్ రెడ్డి, టేకుల శ్రావణ్, మీడియానియోజక వర్గ ఇంచార్జీ మిడిదొడ్డి రాజు, కొండ నవీన్, విష్ణువర్ధన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.