ప్రభుత్వ ఆసుపత్రి మెరుగైన వైద్య సేవలు అందించాలి.

By dhanadhannews.com

  • హుజురాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ ఘటనపై హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ ఆరా.
ఒడితేల ప్రణవ్-కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హుజురాబాద్ నియోజకవర్గం.

సంఘటనపై స్పందించిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ ఆసుపత్రి సూపరిండెంట్ రాజేందర్ రెడ్డి తో ఫోన్ లో వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల కరెంటు ఉండేలా చూసుకోవడంతో పాటు నిరంతరం నీటి సరఫరా అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీల ప్రసవం సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఆసుపత్రి అభివృద్ధి కోసం జిల్లా మంత్రుల లతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగిన సహకారము అందజేస్తారని,రోగులకు సకాలంలో తగిన చికిత్స అందించాలని కోరారు.