- ప్రణవ్ కృతజ్ఞతలు తెలిపిన మండల రైతులు.
- రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం.
- హుజరాబాద్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఒడితల ప్రణవ్.
హుజురాబాద్, ధనాధన్ న్యూస్ :
హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండల పరిధిలోని కానిపర్తి,శంభునిపల్లి,గూడూరు తదితర ఆరు గ్రామాల రైతులు సాగునీరు సమస్యను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి తీసుకొని వెళ్లగా రైతుల బాధ అర్థం చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించి ఎస్ఆర్ఎస్పి అధికారులతో మాట్లాడి రైతులకు సాగు నీరు సరఫరా ను పునరుద్ధరించారు.సాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి,ఒడితల ప్రణవ్ కి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
