కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.

By dhanadhannews.com

మాట్లాడుతున్న జమ్మికుంట బీజేపీ పట్టణ అధ్యక్షులు మల్లేష్.

జమ్మికుంట, ధనాధన్ న్యూస్:

జమ్మికుంట పట్టణ లో బీజేపీ వర్క్ షాప్ బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బిజెపి కరీంనగర్ జిల్లా కార్యదర్శి చెన్న మాధవుని నరసింహా రాజు మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు ఈనెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు ప్రతి వార్డులో ఒక్క బిజెపి ముఖ్య నాయకుడు (ప్రవాస కార్యకర్త) వెళ్లి 24 గంటలు వార్డ్ లోనే ఉండి పరిస్థితులను అధ్యయనం చేస్తూ, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం కోసం సలహాలు సూచనలు చేయాలని సూచించారు.ప్రతి వార్డులో మంచి గుర్తింపు వున్న వ్యక్తులను కలవడం,వివిధ రంగాలలో నైపుణ్యం గల వ్యక్తులను,యువజన సంఘాల నాయకులను కలిసి నరేంద్ర మోడీ సుపరిపాలన గురించి, కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాల గురించి వారికి తెలియజేసి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వారిని నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో మరోసారి రావడానికి సహకరించాలని కోరాలని తెలిపారు.వార్డ్ లోకి వెళ్లిన ప్రవాస కార్యకర్త క్రమశిక్షణతో,పార్టీ ఇచ్చిన సూచన మేరకు పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్,పల్లపు రవి,తిరుపతి శ్రీనివాస్,ఠాగూర్ రాజేష్, మోతే స్వామి,తూడి రవిచంద్ర రెడ్డి,మోడెం రాజు,ఠాగూర్ రాకేష్, బల్సుకురి రాజేష్,గండికోట సమ్మయ్య, కొమ్మ అశోక్, కొండ్లె నాగేష్ ,రాచపల్లి ప్రశాంత్, బూరుగుపల్లి రామ్,ఉడుగుల రవికుమార్,బచ్చు శివకుమార్,మేక సుధాకర్ రెడ్డి,పత్తి జనార్దన్ రెడ్డి, రాపర్తి ప్రవీణ్,ముకుంద సుధాకర్ కొండపర్తి ప్రవీణ్ అప్పల రవీందర్, ఎండి రహీం,పోలు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.